పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Thursday , December 13 2018
Breaking News

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయ దరహాసం ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో విస్పష్ట మెజారిటీ మధ్యప్రదేశ్‌లో నరాలు తెగే ఉత్కంఠ మిజోరంలో ఎంఎన్‌ఎఫ్‌కు పట్టం

రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో సాధించిన ఫలితాలతో కాంగ్రెస్‌లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇదే ఊపుతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి హస్తినలో పాగా వేయగలమన్న ధీమా ఆ పార్టీ అధినాయకత్వంలో కనిపిస్తోంది. అనుకున్న రీతిలో ఫలితాలు రాక భాజపా శిబిరం డీలా పడిపోగా, కాంగ్రెస్‌లో మాత్రం విజయోత్సాహం పెల్లుబికింది. ముఖ్యంగా భాజపాకి మంచి పట్టున్న రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లను గెలుచుకున్న ఊపు ఆ పార్టీ శ్రేణుల్ని, నేతల్ని ఆనందడోలికల్లో ముంచెత్తింది. …

Read More »

ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. కోటి ఎకరాలు పచ్చబడాలి ఆరోగ్య తెలంగాణకు ప్రణాళిక రూపొందిస్తాం ఉద్యోగాల భర్తీ చేపట్టి యువతను ఆదుకుంటాం ఈ విజయం తెలంగాణ ప్రజలదే.. తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్

రైతులు, మహిళలు, నిరుపేద ప్రజలు, దళితులు.. కులాలకు అతీతంగా సకల జనులు నిండుగా దీవించి అందించిన విజయం ఇది. ఇందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ విజయం తెలంగాణ ప్రజలదే. తెరాస కార్యకర్తలు, శ్రేణులు అహోరాత్రులు శ్రమించి పనిచేశారు. ఇప్పుడు అణుకువ, వినయం, విధేయత ఎంతో అవసరం. విజయంతో గర్వం, అహంకారం రాకూడదు. ఎన్నికలన్నాక ఎన్నో మాట్లాడతారు. అంతిమ న్యాయస్థానం ప్రజలు. వారు అప్పగించిన బాధ్యతను నిష్ఠతో నిర్వహించాలి. ప్రతికూలత …

Read More »

హస్త వ్యస్తం కుదేలైన కాంగ్రెస్‌ నేతలు ఓడిన హేమాహేమీలు

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. అంచనాలు తలకిందులై… ఆశలు నిరాశలు కాగా కాంగ్రెస్‌ పార్టీ కుదేలైంది. ముందస్తు ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, సీపీఐతో ప్రజా కూటమిగా బరిలో దిగిన కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్ష ఫలితాలతో షాక్‌కు గురయింది. 99 స్థానాల్లో పోటీచేయగా కేవలం 19 స్థానాల్లో విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో సాధించిన స్థానాలకంటే ఒక స్థానం …

Read More »

తలైవాకు శుభాకాంక్షల వెల్లువ

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈరోజు తన 68వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో తలైవాకు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఈ ఏడాది రజనీ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇటీవల రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన గజ తుపాను తననెంతో బాధకు గురిచేసిందని, అందుకే పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని రజనీ తన అభిమానులతో అన్నారట...

Read More »

‘ఏం చేయకూడదో మోదీనే నేర్పారు’ ప్రజల గుండెచప్పుడు మోదీ వినలేకపోయారు: రాహుల్‌

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కారణంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని ఆయనను ప్రశంసిస్తున్నారు. నిన్న వెలువడిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో స్పష్టమైన మెజార్టీ రాగా, మధ్యప్రదేశ్‌లోనూ అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్‌ అవతరించింది. దీంతో ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టబోతోంది. మంగళవారం సాయంత్రం పార్టీ …

Read More »

చివరి గంట.. లాభాల పంట లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

మంగళవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు లాభాలతో ముగిశాయి. ఎన్నికల ఫలితాలు కొద్ది గంటల వరకు మదుపర్లను ఆందోళనకు గురి చేశాయి. కానీ మధ్యాహ్నం నాటికి పరిస్థితులు మారిపోయాయి. భాజపా ఓటమి కారణంగా నష్టాల్లోకి జారుకుంటాయని అనుకున్నప్పటికీ చివరి గంటల్లో అనూహ్యంగా మార్కెట్లు లాభాలను గడించాయి. ఉదయం 500 పాయింట్ల మేర నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ మధ్యాహ్నానికి కుదుటపడింది. ఫార్మా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటీ, ఆటోమొబైల్‌ …

Read More »

ఈ ఘన విజయం ప్రజలదే: కేసీఆర్‌‌ జాతీయ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాం కోటి ఎకరాలకు సాగునీరే లక్ష్యం

శాసనసభ ఎన్నికల్లో తెరాస ప్రభంజనానికి తెలంగాణ ప్రజలు ఎంతగానో సహకరించారని, ఈ ఎన్నికల్లో తమకు లభించిన ఘన విజయం ప్రజలదేనని తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీలు.. కులాలు, మతాలకతీతంగా నిండుగా దీవించి తమకు ఈ విజయాన్ని అందించారన్నారు. తమకు ఈ గొప్ప విజయం అందించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో జరిగిన ఎన్నికలు …

Read More »

లగడపాటి అంచనాలు తప్పాయి! జాతీయ సర్వేల జోస్యం నిజమైంది!

తెలంగాణ ఎన్నికల ఫలితాల విషయంలో విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వే అంచనాలు తప్పాయి. నవంబరు 7వ తేదీన పోలింగ్‌ పూర్తయ్యాక, ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరున్న రాజగోపాల్‌ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై విడుదల చేసిన సర్వే పెను సంచలనం సృష్టించింది. ఈ సర్వేలో జననాడి ప్రజాకూటమికి అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. చాలా చోట్ల ప్రభుత్వ వ్యతిరేకత అంతర్గతంగా ఉందన్న విషయం తాను ఆర్‌జీఫ్లాష్‌ బృందంతో జరిపిన సర్వేలో తేలిందని …

Read More »

కేసీఆర్‌కు చంద్రబాబు అభినందనలు ఎన్నికల ఫలితాలపై స్పందించిన తెదేపా అధినేత

తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలంగాణలో ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు తెలంగాణలో గెలుపొందిన శాసనసభ్యులందరికీ అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా భాజపా బలహీనపడిందని, ఐదేళ్లలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ భాజపా ఓటమిపాలైందన్నారు. కమలం పార్టీ పాలన పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని …

Read More »

కూకట్‌పల్లిలో సుహాసిని వెనుకంజ

కూకట్‌పల్లి నియోజకవర్గంలో మహాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని వెనుకంజలో ఉన్నారు. అక్కడ తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. 14 రౌండ్లు పూర్తయ్యేసరికి నందమూరి సుహాసినిపై మాధవరం 29,700 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Read More »