పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , January 23 2019
Breaking News
Home / Sports / 10 సిక్సులతో చెలరేగిన సంజూ శాంసన్‌

10 సిక్సులతో చెలరేగిన సంజూ శాంసన్‌

స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు వీరవిహారం చేసింది. రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టులో బ్రెండన్ మెక్ కల్లమ్, క్వింటన్ డికాక్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి విధ్వంసకర ఆటగాళ్లకు సాధ్యం కాని లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ జట్టు ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. రహానే (36), డార్సీ షాట్ (11) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. అనంతరం ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యత సంజు శాంసన్, బెన్ స్టోక్స్ (27) తీసుకున్నారు. జోస్ బట్లర్ (23) స్కోరు బోర్డు పెంచే క్రమంలో పెవిలియన్ చేరాడు. దీంతో చివరి రెండు ఓవర్లలో సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠి శివాలెత్తారు బౌలర్ ఎవరైనా బంతిని బౌండరీ లైన్ దాటించడమే లక్ష్యంగా షాట్లు ఆడారు. ఈ క్రమంలో సంజు శాంసన్ కేవలం బౌండరీ, సిక్సర్ల ద్వారా 68 పరుగులు చేశాడంటే ఎంత ధాటిగా ఆడాడో ఊహించవచ్చు. మొత్తం 45 బంతులెదుర్కొన్న సంజు శాంసన్ 92 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్ ఆర్ జట్టు 4 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ ఐపీఎల్ లో ఇదే అతిపెద్ద లక్ష్యం. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన మెక్ కల్లమ్ (4) విఫలం కాగా, డికాక్ (26) ఫర్వాలేదనిపించాడు. కోహ్లీ (57) అర్ధసెంచరీతో సత్తా చాటాడు. డివిలియర్స్ (20) అవుట్ కావడంతో మన్ దీప్ సింగ్ (47), వాషింగ్టన్ సుందర్ (35) మెరుపులు మెరిపించారు దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 198 పరుగుల వద్ద ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగించి, ఓటమిపాలైంది.

Check Also

ఫీల్డింగ్‌ ఎంచుకున్న కోహ్లీ సేన

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. వన్డే సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే ఆఖరి మ్యాచ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *