పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , May 22 2018
Breaking News
Home / National / రాజీనామాను ఆమోదించని హైకోర్టు చీఫ్ జస్టిస్

రాజీనామాను ఆమోదించని హైకోర్టు చీఫ్ జస్టిస్

2007 మే 18న పాతబస్తీలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన మక్కా మసీదులో జరిగిన పేలుళ్ల కేసులో సంచలన తీర్పు వెలువరించి, ఆ వెంటనే తన పదవికి రాజీనామా చేసిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి రవీందర్ రెడ్డి అనూహ్యంగా గురువారం మళ్లీ విధుల్లో పాల్గొన్నారు. దీనికి కారణం ఆయన చేసిన రాజీనామాను హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆమోదించలేదు. దీనికి తోడు జడ్జి రవీందర్ రెడ్డి సెలవును కూడా రద్దు చేయడంతో తిరిగి విధులకు హాజరయ్యారు. మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ జడ్జి రవీందర్ రెడ్డి ఈ సోమవారం తీర్పు జారీ చేసిన విషయం తెలిసిందే. నాటి పేలుళ్లలో ఎనిమిది మంది మృతి చెందగా, 58 మంది గాయపడ్డారు. తీర్పు తర్వాత జడ్జి రవీందర్ రెడ్డి తన రాజీనామా లేఖను హైకోర్టు చీఫ్ జస్టిస్ కు అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని అందులో పేర్కొన్నారు. తీర్పుతో దీనికి సంబంధం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

Check Also

అభిప్రాయాలు తెలియజేయాలని అటార్నీ జనరల్ ను కోరిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసనకు కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *