పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , May 22 2018
Breaking News
Home / National / రోగులకు పెనుభారంగా డాక్టర్‌ ఫీజు

రోగులకు పెనుభారంగా డాక్టర్‌ ఫీజు

కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యుల కన్సల్టేషన్, రిజిస్ట్రేషన్‌ చార్జీలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. సాధారణ వైద్యుడు నాడీ పడితే చాలు రూ.500 చెల్లించుకోవాల్సిందే. జనరల్‌ ఫిజిషియన్‌ కాకుండా కేన్సర్, కాలేయం, మూత్రపిండాలు, న్యూరాలజీ, గుండె తదితర స్పెషలిస్టుల వద్దకు వెళ్తే రూ.800 నుంచి రూ.1000 వరకు ఇవాల్సిందే. పదేళ్ల క్రితం పరిస్థితికి ప్రస్తుతానికి భారీ తేడా కనిపిస్తోంది. ఒకప్పుడు వైద్యుడి కన్సల్టేషన్‌ రూ.100 నుంచి రూ.150 ఉంటే అదే ఎక్కువ. అప్పట్లో ఫ్యామిలీ డాక్టర్లు ఉండేవారు. కుటుంబంలో ఎవరికే సమస్య వచ్చినా క్లినికల్‌ ఎగ్జామ్‌తోనే పరిష్కారం లభించేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. జ్వరం, తలనొప్పి, జలుబు వంటి సాధారణ జబ్బులకు కూడా వైద్య పరీక్షలు తప్పనిసరిగా మారాయి. హస్తవాసి బాగున్నట్లు కొంచెం పేరు ఉంటే చాలు అంతకు ఎక్కువే చెల్లించుకోవాల్సివస్తోంది. బస్తీల్లో ఉన్న చిన్నచిన్న క్లినిక్‌ల్లో సైతం డాక్టర్‌ కన్సల్టేషన్‌ చార్జీలు అమాంతం పెంచేశాయి. కార్పొరేట్‌ వైద్యం ఖరీదని అందరికీ తెలుసు. వైద్య చికిత్సలే కాదు మినిమమ్‌ కన్సల్టెన్సీ కూడా ఇప్పుడు బహు ఖరీదుగా మారింది. సాధారణంగా ఏదైనా జబ్బు చేసినా…అలాంటి లక్షణాలు కన్పించినా ముందు రోగమేంటో తెలుసుకునేందుకు వైద్యుడిని సంప్రదించక తప్పదు. ఇలా సంప్రదించడంతోనే కార్పొరేట్‌ దోపిడీ ప్రారంభమవుతోంది. జబ్బేంటో తెలియక ముందే రూ.500 నుంచి రూ.1000 చెల్లించుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు డాక్టర్‌ దగ్గరకు వెళ్తే రూ.100 లేదా రూ.150 చెల్లించే వారు. అదే ఫీజుపై మరో రెండుసార్లు చెక్‌ చేయించుకొనే సదుపాయం ఉండేది. ఇప్పుడు సీన్‌ మారింది. కన్సల్టేషన్‌ ఫీజులు అమాంతం పెంచేయడమే కాకుండా…దాన్ని ఒక్కసారి చెకింగ్‌కే పరిమితం చేస్తున్నారు. మరోసారి వైద్యుడ్ని సంప్రదించాలంటే మరో వెయ్యి సమర్పించాల్సిందే. జనరల్‌ ఫిజీషియన్‌ కాకుండా కేన్సర్, కాలేయం, మూత్రపిండాలు, న్యూరాలజీ, గుండె తదితర స్పెషలిస్టుల వద్దకు వెళ్తే భారీగా కన్సల్టేషన్‌ ఫీజు ఇవాల్సి వస్తోంది. ఇటీవల బేగంపేటలోని ఓ ఆస్పత్రిలో డెంగీతో బాధపడుతున్న ఓ చిన్నారికి చికిత్స అందించినందుకు స్పెషలిస్టు ఒక విజిట్‌ కన్సల్టేషన్‌ చార్జీ రూ.7 వేలు వేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక బస్తీల్లో ఉన్న చిన్నచిన్న క్లినిక్‌ల్లో సైతం డాక్టర్‌ కన్సల్టేషన్‌ చార్జీలు అమాంతం పెంచేశారు. దీంతో సామాన్య ప్రజలు డాక్టర్‌ దగ్గరకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.

Check Also

భారత్ తో సంబంధాలకు వెనుకంజ:బాంబే హైకోర్టు

బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. కతువా, ఉన్నావో అత్యాచార కేసులపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న తరుణంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *