పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , May 22 2018
Breaking News
Home / Andhra Pradesh / చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్న

చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్న

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత 2014, ఆగస్టు 15న 13 జిల్లాల ప్రజలకు ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చారని, జిల్లాల వారీగా పరిశీలిస్తే వాటిలో 10 శాతం కూడా అమలు కాలేదనేది స్పష్టం అవుతోందని ఆయన అన్నారు. నాలుగేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా ఈ నెల 14వ తేదీ నాటికి వైఎస్‌ జగన్‌ 2,000 కిలో మీటర్ల మైలురాయిని పశ్చిమగోదావరి జిల్లాలో అధిగమించబోతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్రంలోని 175 శాసనసభా నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించాలని పార్టీ కేంద్ర కార్యాలయం సూచనలు జారీ చేసింది. పాదయాత్ర ముగిసిన మరుసటి రోజు ఆయా జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ పేర్కొంది. పాదయాత్రలు చేస్తున్నపుడు, బహిరంగ సభల్లో మాట్లాడుతున్నపుడు చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలంటూ వైఎస్‌ జగన్‌ ఇచ్చిన ఆదేశాలను కేంద్ర కార్యాలయం ఒక సర్క్యులర్‌ రూపంలో పార్టీ శ్రేణులకు పంపింది. ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాల్లో భాగమైన బెల్ట్‌షాపులు మూతపడలేదు. ఇంటింటికీ 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ ఇవ్వడంలేదు. పూర్తిగా వ్యవసాయ రుణాలు మాఫీ కాలేదు. డ్వాక్రా రుణాల మాఫీయే లేదు కాబట్టి ఆ సంతకాలకు విలువే లేకుండా పోయింది. మొత్తం మీద రాజధాని వైఫల్యం, విభజన హామీల అమలులో వైఫల్యం, ఎన్నికల ముందు, ఆ తరువాత ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం ఇలా అన్ని రకాలుగా చంద్రబాబు వైఫల్యం చెందారు. సాచ్యురేషన్‌ విధానంలో పథకాలను అమలు చేయడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఈ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి ఊరూ, వాడా విస్తృతంగా ప్రచారం చేయాలని వైఎస్‌ జగన్‌ సూచించారు.

Check Also

ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాదయాత్రలో నల్లజెండాలు ఉండాలి

నాలుగు సంవత్సరాలలో చంద్రబాబునాయుడు ప్రభుత్వ వైఫల్యాలను, ఎన్నికల హామీలను నెరవేర్చని వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఈ నెల 14, 15 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *