పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , August 14 2018
Breaking News
Home / Andhra Pradesh / కృష్ణా జలాల పంపిణీ సమస్యలపై ఈ నెలాఖరులోపు భేటీ

కృష్ణా జలాల పంపిణీ సమస్యలపై ఈ నెలాఖరులోపు భేటీ

వాటర్‌ ఇయర్‌ ఆరంభానికి ముందే సమస్యలు పరిష్కరించుకోకుంటే మళ్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నీటి వివాదాలు తప్పవన్న కథనం నేపథ్యంలో ఈ నెలాఖరులోగా బోర్డు సమావేశం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ నెల 29 నుంచి 31 వరకు బోర్డు సమావేశాన్ని నిర్వహించే తేదీని ఖరారు చేసి తమకు తెలియజేయాలంటూ బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం శుక్రవారం ఇరు రాష్ట్రాల ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లకు లేఖలు రాశారు. మొత్తంగా 13 అంశాలను సమావేశపు ఎజెండాలో చర్చించాలని పేర్కొన్న ఆయన ఇతర అంశాలు ఏవైనా సూచిస్తే వాటిని ఈ నెల 18లోగా తమకు పంపాలని రెండు రాష్ట్రాలకు సూచించారు. ఎజెండాలో 13 అంశాలను పేర్కొన్న బోర్డు ఇందులో ప్రధానంగా వర్కింగ్‌ మాన్యువల్, 2017–18 ఏడాదిలో నీటి వినియోగం, వచ్చే ఏడాది నీటి వాటాల వినియోగం, టెలిమెట్రీ అంశాలను చేర్చింది. ఇందులో వాటాల అంశం చాలా కీలకంగా ఉండనుంది. గతేడాది కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో నీటి వాటాలను ఏపీ, తెలంగాణలు 66:34 నిష్పత్తిలో పంచుకున్నాయి. అయితే ఈ నిష్పత్తిని మార్చా లని తెలంగాణ కోరుతోంది. పట్టిసీమ, పోలవరంతో దక్కే వాటాలను దృష్టిలో పెట్టుకొని 61:39 నిష్పత్తి లో పెంచాలని కోరే అవకాశముంది. దీంతో పాటే కృష్ణాలో తమ వాటా 299 టీఎంసీలకు పట్టిసీమతో దక్కే వాటా 45 టీఎంసీలను కలపాలని ఎప్పటినుంచో పట్టుబడుతోంది. ఈ అంశమే బోర్డు సమావేశంలో అత్యంత కీలకంగా ఉండనుంది. బోర్డు వర్కింగ్‌ మాన్యువల్‌పైనా భిన్నాభిప్రాయం వ్యక్తమైంది. ప్రాజెక్టులన్నింటినీ తామే నియంత్రిస్తామని ఇప్పటికే బోర్డు కేంద్ర జలవనరుల శాఖ ముసాయిదాను పంపింది. దీన్ని తెలంగాణ తప్పుపడుతోంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేకుండా నియంత్రణ అక్కర్లేదని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. అయితే ఏపీ.. నియంత్రణ అవసరమంటూ పట్టుదలగా ఉండటంతో బోర్డు ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సిందే. మరోవైపు ఇప్పటికీ టెలీమెట్రీ మొదటి విడత ఏర్పాటుపై స్పష్టత లేదు. దీన్ని కూడా ఎజెండా అంశాల్లో బోర్డు చేర్చింది.

Check Also

ప్రకాశం బ్యారేజీ 40 గేట్లు ఎత్తివేత

కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతుండటంతో జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తోన్న వరదతో బ్యారేజి నిండుకుండలా మారింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *