పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Thursday , October 18 2018
Home / Telangana / రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కాలేజీలకు పోస్టులు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కాలేజీలకు పోస్టులు

నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెండు వైద్య కాలేజీలను 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కాలేజీలకు, వాటికి అనుబంధంగా ఉండే ఆస్పత్రులకు బోధన, బోధనేతర, వైద్య సిబ్బంది పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీనిలో భాగంగా ఈ కాలేజీల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించిన ప్రభుత్వం తాజాగా ఒక్కో కాలేజీకి 952 పోస్టుల చొప్పున 1,904 పోస్టులను మంజూరు చేసింది. వీటిల్లో ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ట్యూటర్, ల్యాబ్‌ టెక్నీషియన్, స్టాఫ్‌ నర్సు వంటి ఉద్యోగాలున్నాయి. సేవల విభాగంలో 237 చొప్పున 2 కాలేజీల్లో మొత్తం 474 పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. వైద్య విద్య సంచాలకుడు ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ జరగనుందని తెలుపుతూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Check Also

‘తిత్లీ’ బాధితులకు తారక్‌, కల్యాణ్‌రామ్‌ సాయం

‘తిత్లీ’ తుపానుతో అల్లకల్లోకమైపోయిన ఉత్తరాంధ్రకు అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ సాయం చేసి మరోసారి తమ పెద్ద మనసును చాటుకున్నారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *