పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Monday , August 20 2018
Breaking News
Home / Telangana / హెచ్‌ఎండీఏకు ప్రధాన ఆదాయ వనరుగా ఓఆర్‌ఆర్‌ టోల్‌ రూపంలో భారీగా పెరిగిన రాబడి

హెచ్‌ఎండీఏకు ప్రధాన ఆదాయ వనరుగా ఓఆర్‌ఆర్‌ టోల్‌ రూపంలో భారీగా పెరిగిన రాబడి

రోజురోజుకు వాహనాలు పెరుగుతుండడంతో టోల్‌ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. నగరానికి ప్రత్యేకతను తీసుకోచ్చిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. గతేడాది నెలకు రూ.16 కోట్లు వస్తే.. అదిప్పుడు ఏకంగా రూ.26 కోట్లకు చేరింది. గతేడాది వార్షికాదాయం రూ.191 కోట్లుగా కాగా ఈ ఏడాది రూ.312 కోట్లకు చేరుకుంది. తాజాగా టోల్‌ వసూలు ప్రక్రియకు టెండర్లు పిలవగా ఏడాది రూ.312 కోట్లకు ఓ సంస్థ దక్కించుకుంది. దీంతో ఒక్కసారిగా హెచ్‌ఎండీఏకు వచ్చే ఆదాయం నెలకు దాదాపు పది కోట్లకు అదనంగా పెరిగినట్లయింది. టోల్‌ వసూలు ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయన్నని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు అత్యాధునిక పరిజ్ఞనంతో నిర్వహణ కార్యకలాపాలు జరిపేందుకు టోల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (టీఎంఎస్‌)ను అందుబాటులోకి తెచ్చారు. టీఎంఎస్‌ ద్వారా టోల్‌ వసూలు, వాహనాల రాకపోకల సంఖ్య గణాంకాల వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. ఓఆర్‌ఆర్‌ టోల్‌ ఫీజు 2012–13లో రూ9 కోట్లు వచ్చింది. 2013–14లో రూ.17 కోట్లు, 2014–15లో రూ.42 కోట్లకు చేరింది. 2016–17లో ఏకంగా రూ.110 కోట్లకు చేరగా.. 2017–18లో ఇప్పటికి రూ.191 కోట్లకు చేరింది. ఈ ఏడాదైతే ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.313 కోట్లకు ఆదాయం పెరిగింది. రోజురోజుకు ఓఆర్‌ఆర్‌ ద్వారా వచ్చివెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో పాటు ఓఆర్‌ఆర్‌ నిర్వహణకు సరైన చర్యలు తీసుకోవడం కూడా ఈ మార్గంలో వాహనదారులు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఓఆర్‌ఆర్‌ చుట్టూ లక్షల సంఖ్యలో మొక్కలు నాటి పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకుంటున్న అధికారులు.. మరో రెండు మూడేళ్లలో ఎటుచూసినా అడవిని తలపించేలా ప్రశాంత వాతావరణాన్ని తీసుకొస్తామంటున్నారు. ‘ఓఆర్‌ఆర్‌ ప్రపంచంలోనే మొట్టమొదటిది. నగరం చుట్టూ బాహ్య వలయ రహదారి ప్రపంచంలోని ఏ నగరానికి లేదు. ఈ రహదారి వల్ల నగరంలో ట్రాఫిక్‌ సమస్య తగ్గింది. ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా గ్రోత్‌ కారిడార్‌ ఏర్పాటు చేశాం. గ్రిడ్‌ రోడ్లు అభివృద్ధి చేస్తున్నాం’ అని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ టి.చిరంజీవులు తెలిపారు.

Check Also

కేరళకు రూ.25 కోట్లు ప్రత్యేక విమానంలో నేడు తరలింపు సీఎస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం

భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకున్న కేరళ ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.25 కోట్లను ప్రకటించింది. అక్కడి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *