పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Saturday , February 23 2019
Breaking News
Home / admin

admin

నగర శివారులోని రాజేంద్రనగర్‌లో విషాదం

శివరాంపల్లి వద్ద  A to Z ఈత కొలనులో మహ్మద్ ఖాజా అనే విద్యార్థి ఈత నేర్చుకోవడానికి వచ్చి నీటమునిగి మృత్యువాతపడ్డాడు. గత కొంతకాలంగా విద్యార్థి ఈత నేర్చుకోవడం కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. శనివారం ఉదయం కూడా రోజులానే స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగాడు. సమయానికి అక్కడ కోచ్‌ లేకపోవడంతో కొంత దూరం వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. బాలుడి మృతికి స్విమ్మింగ్ పూల్ యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Read More »

మెట్రో, ఎంఎంటీఎస్‌ల విషయంలోనూ అంతే

ఈసారి హోంశాఖకు రూ.4,540.95 కోట్లు కేటాయించగా, వీటిలో కనీసం రూ.2 వేల కోట్లు సిటీకి అందుతాయని అంచనా వేస్తున్నారు. బంజారాహిల్స్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘పోలీస్‌ ట్విన్‌ టవర్స్‌’ నిర్మాణమూ వేగవంతమవుతుందని పేర్కొంటున్నారు. ఇక హైదరాబాద్‌ విశ్వనగరం దిశగా అడుగులేస్తున్న నేపథ్యంలో మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తామని పేర్కొంది. ఈ మేరకు మంచినీటి సౌకర్యం, రహదారుల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి, ఔటర్‌ రింగ్‌రోడ్‌తో రేడియల్‌ రహదారుల అనుసంధానం, నాలాల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వనుంది. 

Read More »

కాలం సెంచరీ కొడితే.. కప్పు ముంగిట నిలుస్తాం! 100 రోజుల్లో 2019 వన్డే ప్రపంచకప్‌

ప్రస్తుత ఫామ్‌ ప్రకారం చూస్తే రాబోయే వన్డే ప్రపంచకప్‌ గెలిచే జట్టు టీమ్‌ఇండియానే అంటున్నారు చాలామంది. ఐతే భారత దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ మాత్రం ఆతిథ్య జట్టు ఇంగ్లాండే ప్రపంచకప్‌ నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు. ‘‘ప్రపంచకప్‌ టోర్నీకి బలమైన ఫేవరెట్‌ ఇంగ్లాండే. టోర్నీకి ఆతిథ్యమిస్తున్నారు కాబట్టి ఈ మాట చెప్పట్లేదు. వన్డేల విషయంలో వారి దృక్పథమే మారిపోయింది. 2015 నుంచి వన్డేల్లో వారి ఆట మారిన వైనం, …

Read More »

భారతీయుడు 2’ ఆగిపోయిందా?

విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమా చిత్రీకరణ ఆగిపోయిందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. 23 ఏళ్ల తర్వాత మరోసారి శంకర్, కమల్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. జనవరిలో చిత్రీకరణ మొదలైంది. అయితే దర్శకుడు శంకర్‌కు.. సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ సంస్థకు బడ్జెట్‌ విషయంలో అభిప్రాయభేదాలు తలెత్తాయని తమిళ వర్గాలు …

Read More »

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అమలాపురం ఎంపీ రవీంద్రబాబు విమర్శ జగన్‌ సమక్షంలో వైకాపాలో చేరిక

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నంత కాలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ రాదని అమలాపురం ఎంపీ  పి.రవీంద్రబాబు విమర్శించారు. తెదేపాకు, ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన సోమవారం జగన్మోహన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వైకాపాలో చేరారు. అనంతరం రవీంద్రబాబు మాట్లాడుతూ.. హోదా విషయంలో ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టించారని, కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన ఆయన అదే పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు వైఖరితో బాధపడినందున తెదేపాను వీడి …

Read More »

దేశాన్ని తాకట్టు పెడితే ఉపేక్షించం ఏపీ సీఎం చంద్రబాబు

ఎన్నికలకు ముందు కావాలనే దాడి చేయించారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని తాకట్టు పెడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. దేశ భద్రత కోసం ఐక్యంగా పోరాడేందుకు వెనుకాడబోమని అన్నారు. సైనికులకే తమ మద్దతు ఉంటుందన్నారు. కానీ ప్రధాని మోదీ ఏమైనా చేయగల సమర్థుడని, గోద్రాలో నరమేధాన్ని మరువమని విమర్శించారు. దేశ భక్తిలో, భద్రతలో …

Read More »

రైతుల ఖాతాకు నగదు జమ ఇప్పుడు రూ.1,000.. మార్చిలో రూ.3వేలు 48.89లక్షల మందికి సాయం బ్యాంకు ఖాతాల్లేనివారు 13.44 లక్షల మంది

‘అన్నదాతా సుఖీభవ’ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం చెల్లింపు మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 65.05 లక్షల మంది రైతుల వివరాలను ఆర్టీజీ సేకరించింది. ఇందులో ఆధార్‌, బ్యాంకు ఖాతా పక్కాగా ఉన్న 48.89లక్షల మందిని గుర్తించి ఒక్కొక్కరి ఖాతాకు రూ.వెయ్యి వంతున నగదు బదిలీ చేస్తోంది. సోమవారం వీరికి రూ.258.50కోట్లు జమ చేయగా.. మంగళవారం రూ.231 కోట్లు బదిలీ చేయనున్నారు. సరైన వివరాలు లేని రైతుల సంఖ్య 16లక్షల వరకు …

Read More »

అందుబాటులోకి రానున్న ప్రత్యేక క్లినిక్‌లు ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు తొలుత 10 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు

తెలంగాణలోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా క్లినిక్‌లను నిర్వహించనున్నారు. అందులో అవసరమైన నిర్ధరణ పరీక్షలు చేస్తారు. ఔషధాలను కూడా అందజేస్తారు. మెరుగైన చికిత్స అవసరమని భావిస్తే సమీపంలోని ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులకు పంపిస్తారు. ఈ క్లినిక్‌లు ప్రారంభానికి ముందే గ్రామాల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తారు. రాష్ట్రంలో సుమారు కోటి మందికి పైగా వృద్ధులుంటారని అంచనా. వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా …

Read More »

వ్యవసాయానికి ఏడాదిగా నిరంతర విద్యుత్‌ సరఫరా.. అయినా.. గతేడాదితో పోల్చితే 500 మెగావాట్లు తక్కువగానే వాడకం వర్షాలులేక తగ్గిన పంటల సాగు, బోర్ల వినియోగం

వ్యవసాయానికి నిరంతర (24 గంటలూ) కరెంటు సరఫరా చేస్తున్నా.. వినియోగం కొంత మేర తగ్గింది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంటల సాగు తగ్గడంతో బోర్లకు కరెంటు వినియోగం తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది(2018) జనవరి ఒకటి నుంచి వ్యవసాయ బోర్లకు 24 గంటల సరఫరా ప్రారంభించారు. అంతకుముందు.. రోజుకు 7 గంటలే సరఫరా చేసేవారు. 2018 జనవరి, ఫిబ్రవరి నెలల్లో వినియోగంతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలవ్యవధిలో రాష్ట్రంలో కరెంటు …

Read More »

భైంసాలో విషాదం.. 500 మందికి అస్వస్థత

నిర్మల్‌ జిల్లా భైంసాలో ఓ వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని డీసెంట్‌ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన వివాహ వేడుకలో ఏర్పాటుచేసిన విందు వికటించి సుమారు 500 మంది అస్వస్థతకు గురయ్యారు. విందులో వడ్డించిన పాయసం తినడం వల్లే వారంతా అస్వస్థతకు గురైనట్టు స్థానికులు చెబుతున్నారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న బాధితులను చికిత్స నిమిత్తం భైంసా ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. తొలుత పదుల సంఖ్యలోనే అస్వస్థతకు గురైనప్పటికీ.. క్రమంగా వారి సంఖ్య వందల సంఖ్యకు …

Read More »