పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , August 14 2018
Breaking News
Home / Andhra Pradesh (page 2)

Andhra Pradesh

Andhra Pradesh

దుర్గగుడిలో చీర మాయంపై సందిగ్ధత సాకులతో సరిపెడుతున్న ఆలయ అధికారులు, పోలీసులు

విజయవాడ దుర్గగుడిలో అమ్మవారికి సారె రూపంలో వచ్చిన చీర మాయమైన ఘటనలో సందిగ్ధత కొనసాగుతోంది. ఘటనపై విచారణ విషయంలో పోలీసులు, దుర్గగుడి అధికారులు సాకులతో సరిపెడుతున్నారు. భక్తులు చీర తెచ్చినట్లు రికార్డుల్లో నమోదు కానందున పోలీసులకు ఫిర్యాదు చేయలేమని దుర్గగుడి అధికారులు అంటున్నారు. అదే సమయంలో తమకు భక్తుల నుంచి గానీ, అధికారుల నుంచి గానీ ఫిర్యాదు రానందున కేసు నమోదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే …

Read More »

రాష్ట్రంలో సినీ పర్యాటకానికి ప్రోత్సాహం ఉన్నత ప్రమాణాలతో ఫిల్మ్‌ అండ్‌ టీవీ ఇనిస్టిట్యూట్‌

ఆంధ్రప్రదేశ్‌లో సినీ పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని, దీనికోసం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్నత ప్రమాణాలతో ఫిల్మ్‌ అండ్‌ టీవీ ఇనిస్టిట్యూట్‌ నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. హిందూపురం శాసనసభ్యుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, మరో నటుడు దగ్గుబాటి రానా, సినీ దర్శకుడు క్రిష్‌ శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో సినీరంగం అభివృద్ధిపై వీరు …

Read More »

భావితరాలకు ఎన్టీఆర్‌ చరిత్ర చాలా అవసరం నిమ్మకూరులో దర్శకుడు క్రిష్‌తో కలిసి పర్యటించిన బాలకృష్ణ

నందమూరి తారక రామారావు జన్మస్థలమైన కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృఫ్ణ, దర్శకుడు‌ క్రిష్‌తో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు తొలుత గ్రామంలోని ఎన్టీఆర్‌, బసవతారకం కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. అనంతరం వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి కాలినడకన ఎన్టీఆర్‌ నివాస గృహం, పంట పొలాలు తదితర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం ఎన్టీఆర్‌ …

Read More »

విద్యార్థులతో సీఎం ముఖాముఖికి జ్ఞానభేరిగా పేరు ఖరారు 20వేల ఉద్యోగాల భర్తీకి మంత్రిమండలి ఆమోదముద్ర

ఒకవైపు నిరుద్యోగ భృతికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు భారీగా ఉద్యోగాల భర్తీకీ సిద్ధమైంది. దాదాపుగా 20వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. దీంతో రానున్న నెలల్లో ఉద్యోగ ప్రకటనలు రానున్నాయి. కొలువుల పండగ వాతావరణం నెలకొననుంది. భర్తీ చేసే పోస్టుల్లో వివిధ ప్రభుత్వ విభాగాల్లో 10వేలు, విద్యాశాఖలో 9,698 ఉన్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నుంచి చేపట్టనున్న …

Read More »

ఆగస్టు 3 లేదా 4 వారాల్లో నమోదు ప్రక్రియ ప్రారంభం నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే నగదు జమ

ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన మేరకు నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికీ నెలకు రూ.1000 అందిస్తామని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లారు. ఈ పథకానికి ‘ముఖ్యమంత్రి -యువనేస్తం’ అని నామకరణం చేశామన్నారు. ఆగస్టు 3 లేదా 4 వారాల్లో నిరుద్యోగుల నమోదు ప్రక్రియ ఆరంభం అవుతుందని తెలిపారు. ప్రజా సాధికార సర్వేలాగా ఈ కేవైసీ జరుగుతుందన్నారు. 22 నుంచి …

Read More »

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడాలి.. ఎంపీలతో టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు

రాజకీయ లాభాల కోసం ప్రజల్లో అశాంతి సృష్టించే కుట్రలు జరుగుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపక్షాలపై మండిపడ్డారు. ముస్లిం ఓట్ల తొలగింపును ప్రతిఘటించాలని ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం ఎంపీలతో సీఎం ఈ ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

Read More »

ఎంఓయూల్లో రాష్ట్రానికి రెండో స్థానం పది ఐటీ కంపెనీల ప్రారంభోత్సవ సభలో మంత్రి లోకేశ్‌

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో అమరావతి, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం, తిరుపతిలను ఐదు సైబరాబాద్‌లుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని… ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు. అభివృద్ధి ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ఉండేందుకు ఈ తరహా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బుధవారం విజయవాడలోని తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రవాసాంధ్రుల సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) కార్యాలయం నుంచి విజయవాడ, గన్నవరం, మంగళగిరిలో కొత్తగా ఏర్పాటైన పది ఐటీ కంపెనీలను మరో …

Read More »

మేం పోరాడుతుంటే జగన్‌, పవన్‌ ఏమయ్యారు? కాపులపై వైకాపాది రోజుకో మాట: చంద్రబాబు

ప్రత్యేక హోదాతోపాటు, అన్ని హామీలు సాధించి తీరతామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తమవి న్యాయమైన కోర్కెలనీ, అందుకే ధర్మపోరాటం చేపట్టామని అన్నారు. ఓపిగ్గా ప్రయత్నం చేస్తామని, పోరాడాల్సి వస్తే ఎవరైనా నా తర్వాతే అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని పేరూరులో ఎగువ పెన్నా జలాశయానికి కృష్ణా జలాలు తరలించే పథకానికి ముఖ్యమంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. అక్కడే గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో సీఎం …

Read More »

తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ఉపరాష్ట్రపతిని కలిసిన తెదేపా ఎంపీలు, ఐకాస సభ్యులు

కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ రావడం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు ఇష్టం లేదని తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ అన్నారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆజిల్లాకు చెందిన ఎంపీలు, ఐకాస నేతలు కోరారు. దిల్లీలోని ఆయన నివాసంలో వెంకయ్యను కలిసిన నేతలు.. విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని వివరించారు. కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించిన వినతిపత్రాన్ని ఆయనకు …

Read More »

భూముల విలువ సవరణలు అమల్లోకి 5% మించి పెంచకూడదన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు మార్పులు

రాష్ట్రవ్యాప్తంగా సవరించిన భూముల విలువలు బుధవారం (ఆగస్టు 1) నుంచి అమల్లోకి రానున్నాయి. భూముల ధరల పెంపు 5 శాతం మించకూడదన్న ప్రభుత్వ సూచనకు లోబడి సదరు కమిటీలు విలువను ఖరారు చేశాయి. పట్టణాలు, నగరాల్లో 0-5% వరకూ భూముల విలువను పెంచారు. ఇకపై ఈ కొత్త ధరలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రిజిస్ట్రేషన్లు చేయనుంది. ఆ మేరకు సాఫ్ట్‌వేర్‌లో మార్పులుచేశారు. ఆయా ప్రాంతాల డిమాండ్లు, ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుని …

Read More »