పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , May 22 2018
Breaking News
Home / Andhra Pradesh (page 20)

Andhra Pradesh

Andhra Pradesh

రెండో రోజు స్లిప్పులతో చిక్కిన ముగ్గురు

కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో జరుగుతున్న నర్సింగ్‌ రెండో సంవత్సరం పరీక్షల్లో శుక్రవారం స్లిప్పులతో కాపీ రాస్తూ ముగ్గురు విద్యార్థులు పట్టుబడ్డారు. మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోందని ఆరోపణలు రావడం, తొలిరోజు పదిమంది విద్యార్థులు స్లిప్పులతో రాస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే. రెండో రోజు కూడా రెండు ప్రైవేట్‌ కాలేజీలకు చెందిన ముగ్గురు విద్యార్థులు స్లిప్పులు రాస్తూ పట్టుబడ్డారు. జీఎన్‌ఎం నర్సింగ్‌ రెండో ఏడాది పరీక్షలకు 1,143 మంది విద్యార్థులు హాజరు …

Read More »

మూసుకుపోయిన రైలు మార్గం

తూర్పు గోదావరి జిల్లా వాసుల దశాబ్దాల ఆశలపై రైల్వేశాఖ నీళ్లు చల్లింది. ఆర్థికంగా లాభదాయకం కాదన్న నెపంతో కాకినాడ పిఠాపురం రైల్వేలైన్‌ ప్రాజెక్టును అభయన్స్‌ (తాత్కాలిక నిలుపుదల)లో రైల్వేబోర్డు పక్కన పెట్టేసింది. దీంతో పిఠాపురం కాకినాడ రైల్వేమార్గం నిర్మాణానికి మార్గం పూర్తిగా మూసుకుపోయింది. గత మూడు సంవత్సరాలుగా రైల్వే బడ్జెట్‌లో మొక్కుబడిగా నిధులు కేటాయించిన రైల్వేశాఖ కాకినాడ పిఠాపురం మధ్యలో 22 కిలోమీటర్ల మేర రైల్వేలైన్‌ నిర్మాణం వల్ల కలిసొచ్చేది …

Read More »

ఆ భూములెవరివో తేల్చండి

సదావర్తి భూముల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. వందల కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడం, కోర్టుల జోక్యం, రెండుసార్లు వేలం వంటి పరిణామాల నేపథ్యంలో.. తమిళనాడు తెరపైకి రావడంతో అసలు భూములెవరివో తేల్చాలంటూ సుప్రీంకోర్టు పరోక్షంగా స్పష్టం చేసింది. ఈ భూములు ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖవి కావని, తమకు చెందినవని, అందువల్ల వేలం నిర్వహిం చరాదంటూ తమిళనాడు చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న …

Read More »

వణుకుతున్న వెంకటాపురం

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ వై.రామవరం మండలం చాపరాయి గ్రామంలో 16 మంది మృత్యువాత పడిన సంఘటన మరువక ముందే చింతూరు ఏజెన్సీలోని వెంకటాపురం గ్రామం అంతుచిక్కని వ్యాధులతో వణుకుతోంది. పదిహేను రోజుల్లో గ్రామంలో ముగ్గురు మృత్యువాత పడగా మరో పది మంది వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. గ్రామస్తులు వరుసగా మృత్యువాత పడుతుండడంతో ఆదివాసీలు భయంతో గ్రామాన్ని వీడి ఇతర గ్రామాలకు వెళ్లిపోతున్నారు. 30 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని …

Read More »

ఇంటర్నెట్‌ నుంచే రేషన్‌కార్డు

రేషన్‌కార్డు పోయిందా? కొత్త రేషన్‌కార్డు దరఖాస్తు చేసుకున్నారా? మీరు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉంటే చాలు ఇంట్లో నుంచే వాటిని సులభంగా పొందవచ్చు. గతంలో తెల్లకార్డు/గులాబి కార్డును పొందిన కుటుంబాలు ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల వివరాలు ఏ విధంగా నమోదు/తొలగించాలనే వివరాలు మీకోసం.ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు విషయం లేదా ఏ ఇతర సందర్భాల్లో మీతో పాటు మీ కుటుంబ సభ్యుల గుర్తింపు …

Read More »

మరో పర్యటనకు ముద్రగడ

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరో పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 8,9 తేదీలలో కోనసీమలో ఆయన పర్యటించనున్నారు. కాపు ఉద్యమానికి మద్దతు పలికిన పి. గన్నవరం నియోజకవర్గంలో అభిమానులకు ఆత్మీయ పలకరింపు చేయనున్నారు. ఉద్యమ సమయంలో ఎవరినైతే కిర్లంపూడికి రానివ్వలేదో వారినే ముద్రగడ కలుస్తారని కాపు జేఏసీ నేతలు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, కల్వకొలను తాతాజీ తెలిపారు. కాపు రిజర్వేషన్లు ఇచ్చేవరకు తమ …

Read More »

గజపతిరాజుకు ఎందుకంత అసహనం?

జిల్లా కలెక్టరేట్‌లో ఆ మధ్య జరిగిన అధికారుల సమీక్షలో నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) రీజనల్‌ అధికారిపై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నన్ను పీఏగా రమ్మంటారా’ అని మండి పడ్డారు. గరుగుబిల్లి మండలం ఉల్లిభద్రలోని ఉద్యానకళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంపై రైతులకు సమాచారం అందించలేదన్న కారణంతో అక్కడి అధికారులపై విరుచుకుపడ్డారు. అంతేనా… రైతులకు ప్రభుత్వం తరఫున క్షమాపణలు కూడా చెప్పారు.తాజాగా విజయనగరంలోని సిరిమానోత్సవం సందర్భంగా …

Read More »

నారాయణలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

నారాయణ కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా కడపలో కృష్ణాపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న పావని(17) హాస్టల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా బాకరాపేటకు చెందిన పావని గురువారం రాత్రి హాస్టల్‌లోని తన గదిలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.పావని ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించడానికి వెళ్లిన బంధువలను నారాయణ కాలేజీ సెక్యురిటీ సిబ్బంది అడ్డుకుంది. విద్యార్థిని బంధువులను హాస్టల్‌లోకి …

Read More »

ఎమ్మెల్యే ఆమంచి దౌర్జన్యం

వాడరేవులోని మత్య్సకార మహిళపై చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ దౌర్జన్యానికి దిగారు. నన్నే ఎదిరించి మాట్లాడతావా.. అంటూ ఆమె జీవనోపాధి అయిన చేపల బండిని తీసివేయించి ఆమె బతుకుదెరువును ప్రశ్నార్థకం చేశారు. వివరాలు.. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గురువారం సాయంత్రం వాడరేవు తీరం వద్ద పర్యటించారు. తీరం వద్ద చెత్తాచెదారం ఉండటంతో అక్కడ బండి మీద చేపలు అమ్ముకుంటున్న మత్య్సకార మహిళ కొండూరి అంజమ్మను పిలిచి చెత్తను …

Read More »

దంపతుల మృతదేహాల వెలికితీత

నగరానికి చెందిన పాత ఇనుము వ్యాపారి పల్లపోతు శ్రీనివాసరావు, ప్రమీలారాణి దంపతుల మృతదేహాలను గురువారం పోలీసులు వెలికితీశారు. నిందితులు పూడ్చిన మృతదేహాలను డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు, రిమ్స్‌ వైద్యుల సమక్షంలో బయటకు తీశారు. దంపతులను అత్యంత కిరాతకంగా హతమార్చిన హంతకులు అంతే కిరాతకంగా నాలుగు అడుగుల గుంతలో పాతి పెట్టారు. మృతదేహాలను గోనె సంచిలో కుక్కినట్లు గోతిలో కుక్కారు. ఇదంతా చేసింది ఏ పొలాల్లోనో.. చెట్ల పొదల్లోనో …

Read More »