పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , October 17 2018
Breaking News
Home / Andhra Pradesh (page 3)

Andhra Pradesh

Andhra Pradesh

తాడిపత్రిలో పురివిప్పిన పాతకక్షలు! నలుగురిపై కత్తులతో దాడి.. ఇద్దరు మృతి

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారిచెరువులో నలుగురు వ్యక్తులపై జరిగిన దాడిలో ఇద్దరు మృతి చెందారు. తాడిపత్రిలోని పెన్నా సిమెంట్ సమీపంలోని మద్యం దుకాణం వద్ద ఈరోజు ఉదయం వెంకటరమణ, తలారి రంగయ్యతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉండగా హఠాత్తుగా కొందరు దుండగులు కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో వెంకటరమణ అక్కడిక్కడే మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా …

Read More »

కూతురి మరణం..భార్యకు చెప్పలేక!! విధి విషమ పరీక్షలో తల్లడిల్లుతున్న తండ్రి

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని విశ్రాంత అధ్యాపకుడు దంత సింహబలుడు కుమార్తె శ్రీదేవి, అల్లుడు వాసుదేవరావు. ఉద్యోగ రీత్యా విశాఖపట్నంలో స్థిరపడ్డారు. వీరి ఏకైక కుమార్తె సాయిప్రత్యూష. విశాఖపట్నంలోని ఓ కళాశాలలో బి.బి.ఎ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. తల్లి శ్రీదేవి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుండగా, తండ్రి వాసుదేవరావు ఓ బ్యాంకులో సహాయ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రత్యూషకి ఈ నెల 9వ తేదీన డెంగీ జ్వరంరావటంతో విశాఖపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి …

Read More »

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ధనుంజయరెడ్డి ఆదేశం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చింది. ఇది గురువారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఈ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. వాయుగుండం కళింగపట్నం(శ్రీకాకుళం)-పూరీ(ఒడిశా) మధ్య తీరం దాటే అవకాశముందని భువనేశ్వర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం(ఐఎండీ) సూచించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 20, …

Read More »

అంగరంగ వైభవంగా శ్రీవారి రథోత్సవం

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం రథోత్సవం వైభవోపేతంగా సాగింది. మేరుపర్వతం వంటి రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు విశేషాలంకరణలతో ఆశీసులయ్యారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ రథం పగ్గాలను లాగగా … తిరువీధుల్లో రథోత్సవం సాగింది. వేలాది మంది భక్తులు తేరు పగ్గాలను పట్టుకొని రథాన్ని లాగారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఈ రాత్రి తొమ్మిది గంటలకు జరిగే …

Read More »

ప్రబోధానంద స్వామిపై కేసు నమోదు హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రసంగించారంటూ తెదేపా నేత ఫిర్యాదు

అనంతపురం జిల్లా గుత్తి పోలీస్‌స్టేషన్‌లో ప్రబోధానంద స్వామిపై కేసు నమోదైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగించారంటూ తెదేపా నేత మధుసూదన్‌ గుప్తా ప్రబోధానందపై ఫిర్యాదు చేసి.. సీడీలను సాక్ష్యాలుగా అందజేశారు. వాటిని పరిశీలించిన పోలీసులు ప్రబోధానందపై కేసు నమోదు చేశారు.కొద్దిరోజుల క్రితం తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామం వద్ద జరిగిన విధ్వంసానికి సంబంధించి ప్రబోధానందపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అయితే తాజాగా గుత్తికి చెందిన తెదేపా నేత మధుసూదన్‌ …

Read More »

గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటపై కమిటీ నివేదిక సమర్పణ శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి పితాని

గోదావరి పుష్కరాల సమయంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం ముహూర్త కాలంపై జరిగిన దుష్ప్రచారమేనని కమిటీ తేల్చింది. తొక్కిసలాట ఘటనపై నియమించిన కమిటీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించింది. ఆ నివేదికను మంత్రి పితాని సత్యనారాయణ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు.

Read More »

ఆ ప్రేమలో 5శాతమైనా ఏపీపై ఉంటే బాగుండేది కేంద్రం తీరుపై మరోసారి చంద్రబాబు ఆగ్రహం

రాష్ట్ర విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విభజన హామీలు, కేంద్రం వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా భాజపా తీరును ఎండగట్టారు. అంతకుముందు మాట్లాడిన భాజపా ఫ్లోర్‌లీడర్‌ విష్ణుకుమార్‌ రాజు 90శాతం విభజన హామీలు నెరవేర్చామని తెలపగా.. చంద్రబాబు ఎదురుదాడికి దిగారు. ‘‘ 90శాతం హామీలు నెరవేర్చామని చెప్పడానికి మీ ఆత్మ ఏ విధంగా ప్రబోధిస్తుందో నాకర్థం కావట్లేదు. …

Read More »

ప్రబోధానంద శిష్యుల దాడిలో వ్యక్తి మృతి జేసీ దివాకర్‌రెడ్డికి సైతం తగిలిన రాయి ఆశ్రమం తరలించాల్సిందేనని ఎంపీ నిరసన

గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా శనివారం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని చిన్నపొలమడ, పెద్దపొలమడ గ్రామాల్లో తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఆదివారం రోజంతా ఉద్రిక్తతలు కొనసాగాయి. శనివారం తాడిపత్రి మండలం పెద్దపొలమడ నుంచి వినాయకుడి విగ్రహాలను చిన్నపొలమడ, ప్రబోధానంద ఆశ్రమం మీదుగా  తరలించే క్రమంలో పెద్దపొలమడ గ్రామస్థులకు ప్రబోధానంద శిష్యులకు మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ప్రబోధానంద ఆశ్రమ నిర్వాహకులు, శిష్య బృందం తీరుకు నిరసనగా అనంతపురం …

Read More »

రాష్ట్రంలో విపక్షం ఇంకా విషం చిమ్ముతూనే ఉంది రాజధాని అమరావతికి ఇక వరద ముప్పు ఉండదు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కొండవీటివాగు ఎత్తిపోతల జాతికి అంకితం

బాబ్లీ కేసులో నోటీసుల జారీకి, తమకు సంబంధం లేదని హైదరాబాద్‌లో భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా వ్యాఖ్యానించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్రలో ఏ ప్రభుత్వం ఉంది? కేంద్రంలో ప్రభుత్వం ఎవరిదని నిలదీశారు. అసలు అమిత్‌షా అలా వ్యాఖ్యానించటం ఏమిటని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడేవారిని, బ్యాంకులను దోచుకున్నవారిని విదేశాలకు పంపుతున్నారని విమర్శించారు. బాబ్లీ వ్యవహారంపై సోమవారం అసెంబ్లీలో మాట్లాడతానన్నారు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని రాష్ట్రం లోపలే ఆందోళనలు …

Read More »

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ42

వాణిజ్య ప్రయోజనాలే లక్ష్యంగా ఇస్రో మరో ప్రయోగం చేపట్టింది. నిరంతరాయంగా 33 గంటల పాటు కౌంట్ డౌన్‌ అనంతరం శ్రీహరికోటలోని సతీష్‌ థావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ-సీ42 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్వీ-సీ42 వాహకనౌక ద్వారా బ్రిటన్‌కు చెందిన నోవాసర్‌, ఎస్‌ 14 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. నోవాసర్‌, ఎస్‌ 14 ఉపగ్రహాలు భూమికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తాయి. ఈ రెండు ఉపగ్రహాలను సర్వే శాటిలైట్‌ …

Read More »