పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , August 14 2018
Breaking News
Home / Andhra Pradesh (page 30)

Andhra Pradesh

Andhra Pradesh

ఆయుర్వేద వైద్యురాలు ఆత్మహత్య

మనస్తాపంతో ఆయుర్వేద వైద్యురాలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శివాజీపాలెంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఎంవీపీ పోలీసుల కథనం ప్రకారం.. మధురవాడ ఆయుర్వేద వైద్యశాలలో పనిచేస్తున్న దీప శివాజీపాలెం శివాజీ పార్కు సమీపంలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం యథావిధిగా అన్ని పనులు ముగించుకుని ఆస్పత్రికి సంబంధించిన ముఖ్యమైన ఫైల్‌ వెతుక్కోవాలని తన గదిలోకి వెళ్లింది. ఆమె ఎంతకీ బయటకు …

Read More »

జాబెప్పుడు బాబూ

ముత్తుకూరు మండలం నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీ జెన్‌కో సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో ఏళ్లు గడుస్తున్నా కాంట్రాక్ట్‌ కార్మికులను క్రమబద్ధీకరించలేదు. 3వ యూనిట్‌లో 800 మెగావాట్ల ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేశారు. ఉద్యోగుల నియామకం మాత్రం చేపట్టలేదు. ఈ ప్రాజెక్ట్‌లో 1, 2వ యూనిట్లలో 760 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పని చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు నాలుగేళ్ల క్రితమే జెన్‌కో యాజమాన్యం 300 పోస్టులను …

Read More »

ఎస్‌ఐపై దోపిడీ దొంగల దాడి

దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠా పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నారు. వీరిని పట్టుకోవడానికి నిఘా పెట్టిన ఎస్‌ఐపై కత్తితో దాడి చేశారు. సోమవారం ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్‌గేట్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు, సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లాపల్లి టోల్‌ప్లాజా సమీపంలో దొంగలు సంచరిస్తున్నారని, రోడ్డు పక్కన నిలిపిన వాహనాలు, లారీల డ్రైవర్లను బెదిరించి దోపిడీలు చేస్తున్నారని స్థానిక పోలీసులకు …

Read More »

రాష్ట్రంలో కలెక్టర్ల వ్యవస్థ నిర్వీర్యం

రాష్ట్రంలో కలెక్టర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌ విమర్శించారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులకు కూడా ఎలాంటి అధి కారాలు లేకుండా చేశారని, అంతా అధికార పార్టీ నేతలతో ఏర్పాటైన జన్మభూమి కమిటీల కనుసన్నల్లోనే నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు.సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వరప్ర సాద్‌ విలేకరులతో మాట్లాడారు.ఏపీలో సీఎం కార్యాలయమే రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తోందన్నారు. మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ …

Read More »

దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా..

దైవదర్శనానికి శ్రీశైలం వెళ్లొస్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఆత్మకూరు ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో ముంబై రోడ్డుపై సోమవారం వేకువన చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు..ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లక్నోకు చెందిన శ్రావణ్‌కుమార్‌ మిశ్రా ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తూ నెల్లూరులో నివాసం ఉంటున్నాడు. రెండ్రోజుల క్రితం తమ ఇంటి చుట్టుపక్కల వారితో కలిసి …

Read More »

ప్రత్తి శేషయ్యకు గాంధీస్మారక పురస్కారం

స్వాతంత్య్ర సమరయోధుడు, గాందేయవాది ప్రత్తి శేషయ్యకు గాంధీ స్మారక పురస్కారం అందజేయనున్నట్టు జిల్లా సర్వోదయమండలి ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహాత్మాగాంధీ 148వ జయంతి సందర్భంగా ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. అక్టోబర్‌ 2న తాడేపల్లిగూడెం సత్యవతి నగర్‌లోని శేషయ్య నివాసంలో రాష్ట్ర సర్వోదయమండలి ఆధ్వర్యంలో అవార్డును అందజేయనున్నట్టు చెప్పారు.

Read More »

అబ్బురపరుస్తోన్న పెరటి పొట్ల

ఎటువంటి ఎరువులు వినియోగించనప్పటికీ ఓ ఇంటి పెరట్లో పొట్ల పాదు ఏకంగా 8 అడుగుల మేర కాయలను ఇస్తూ చూపరులను అబ్బురపరుస్తోంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లెకంటి వెంకమ్మ తన ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో పొట్ల విత్తనాలు నాటింది.ఆ పాదు ఇప్పటికే వందకు పైగా పొట్లకాయల దిగుబడినిచ్చింది. ప్రతి కాయ సుమారు 7 అడుగుల నుంచి 8 అడుగుల వరకు ఉండటం …

Read More »

‘చమురు’ వదులుతోంది!

దేశంలోని ఏ రాష్ట్రంలో అమలుచేయని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై అదనపు పన్ను వేసి వినియోగదారుల నడ్డివిరుస్తోంది. రాష్ట్రంలో ఏటా సుమారు 450 కోట్ల లీటర్ల డీజిల్, 115 కోట్ల లీటర్ల పెట్రోలు వినియోగిస్తున్నట్లు అంచనా. పెట్రోల్, డీజిల్‌పై వేసే వ్యాట్‌ కాకుండా ప్రతి లీటరుకు అదనంగా వినియోగదారుల జేబులో నుంచి మరో నాలుగు రూపాయలు లాగేస్తున్నారు. దీంతో 450 కోట్ల లీటర్ల డీజిల్‌పై రూ.1,800 కోట్లు, …

Read More »

మహిళ దారుణ హత్య

వేంపల్లె పట్టణంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మృతురాలి కోడలు రియానా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. వేంపల్లె పట్టణంలోని శ్రీచైతన్యనగర్‌ వీధి సమీపంలో షేక్‌ నూర్జహాన్‌(55) చిల్లర కొట్టు పెట్టుకొని వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. మృతురాలికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు మస్తాన్‌వల్లి భార్య రియానా వేంపల్లెలోని …

Read More »

కలిసి పోయారు

సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మృతిచెందారు. పోలీసుల కథ నం మేరకు.. చిత్తూరు రూరల్‌ మిట్ట ఇండ్లు గ్రామానికి చెందిన మునిరాజులు, లలిత రెండవ కుమారుడు కిరణ్‌కుమార్‌(14) మాపాక్షి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అలాగే నరిగపల్లెకు చెందిన మురగయ్య, కవిత దంపతుల ఏకైక కుమారుడులోకేష్‌ (14) సిద్దంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. లోకేష్‌ మిట్ట ఇండ్లులోని అమ్మమ్మ …

Read More »