పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , August 14 2018
Breaking News
Home / Andhra Pradesh (page 4)

Andhra Pradesh

Andhra Pradesh

బెజవాడలో పెరుగుతున్న కేసులు ఏడు నెలల్లోనే పట్టుబడిన 3,677 మంది లైసెన్సుల రద్దుకు పోలీసుల సిఫార్సు

వారాంతాల్లో విందు, వినోదాల్లో తేలిపోయే వారి సంఖ్య ఎక్కువైంది. శని, ఆదివారాలు వస్తే చాలు రాత్రిళ్లు మద్యంతో ఖుషీ చేసుకుంటున్నారు. ఆనక తప్పతాగి ద్విచక్ర వాహనాలు, కార్లు నడుపుతున్నారు. దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. తాగి పోలీసులకు పట్టుబడుతున్న వారిలో యువకుల నుంచి నడి వయస్కు వారు అధికంగా ఉంటున్నారు. కమిషనరేట్‌ పరిధిలో జరిగే ప్రమాదాల్లో దాదాపు పది శాతం వరకు మద్యం తాగి వాహనాలు నడపడం కారణంగా జరుగుతున్నాయి. …

Read More »

పార్లమెంటు ప్రాంగణంలో తెదేపా ఎంపీల ఆందోళన

ప్రత్యేక హోదా దిల్లీలో తెదేపా ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ఈరోజు పార్లమెంటు ఒకటో నంబర్ ప్రవేశ ద్వారం, గాంధీ విగ్రహం వద్ద తెదేపా పార్లమెంటు సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రధాని, కేంద్రం ప్రభుత్వం ఏ ఒక్క అంశంపైనా స్పష్టత ఇవ్వలేదని ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమాలు ఇక ముందూ కొనసాగిస్తామని తెలిపారు. ఎన్డీయేకు మెజారిటీ ఉన్నా ఏపీకి …

Read More »

కాంగ్రెస్‌ ప్రజల విశ్వాసం కోల్పోయింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌

ఎన్డీయే ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన అవిశ్వాసానికి మద్దతిచ్చి.. కాంగ్రెస్‌ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. ప్రధాని మోదీ నిజాలు చెప్పారని.. అందుకే ఈ దేశం ఆయన ప్రభుత్వాన్ని విశ్వసిస్తోందన్నారు. ‘కాంగ్రెస్‌, ఆ పార్టీ మిత్రపక్షాలు చేసే అసత్య ప్రచారాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రసంగం ద్వారా తిప్పికొట్టారు. ఈ అవిశ్వాస తీర్మానంతో కేంద్ర ప్రభుత్వానికి భారీ మెజార్టీ వచ్చింది. ఈ తీర్మానం వల్ల …

Read More »

మీరు తప్పు చేశారు కాబట్టే నిలదీశా ప్రధాని పదవిలో ఉండి ఇలా ఎలా మాట్లాడుతారు? దిల్లీలో మీడియాతో చంద్రబాబు

పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉందని తెలుసని.. అయినా తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దిల్లీలో చంద్రబాబు జాతీయ మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకముందూ ఏపీ ప్రజలకు న్యాయం చేయడంలో సహకరిస్తారని ఆశిస్తున్నానన్నారు. 15 ఏళ్ల తర్వాత తామే అవిశ్వాసం పెట్టామని చెప్పారు. మెజారిటీకి, నైతికతకు మధ్య జరుగుతోన్న పోరాటమిదని పేర్కొన్నారు. ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన …

Read More »

అన్ని పార్టీల ఎంపీలకు చంద్రబాబు లేఖ

దేశంలోని అన్ని పార్టీల ఎంపీలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. లేఖతో పాటు విభజన చట్టం అమలుకు సంబంధించిన బుక్‌లెట్‌ను పంపారు. 2014 ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ఏపీని భాజపా మోసం చేసిందన్న ఆయన.. తిరుపతి, నెల్లూరు సభల్లో హోదాపై ప్రధాని అభ్యర్థిగా మోదీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని సీఎం లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని.. విభజన హక్కుల సాధన కోసమే అవిశ్వాసం నోటీసు …

Read More »

ఎలాంటి పరిణామాలకూ వెనుకాడొద్దు: చంద్రబాబు

పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ పోరాటం భావి తరాల కోసమేనన్న విషయం అందరికీ స్పష్టం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సభ నుంచి సస్పెండ్ చేసినా వెనుకంజ వేయొద్దని.. ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం పోరాటం కొనసాగించాలని తేల్చిచెప్పారు. తాను దిల్లీ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటానని…, ఒక లక్ష్యం కోసం చేస్తున్న పోరాటానికి అందరి మద్దతు కూడగట్టాలని సూచించారు.

Read More »

ముఖ్యమంత్రి ఆదేశాలతో నష్టనివారణ చర్యలు 23 వరకు భక్తుల అభిప్రాయ సేకరణకు నిర్ణయం 24న ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానాలు

మహాసంప్రోక్షణ సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనంపై తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించనున్నట్లు తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తితిదే తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఉదయం స్పందించారు. తితిదే అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌యాదవ్‌, ఈవోతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం తిరుమలలో ఈవో, ఛైర్మన్‌లు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి.. నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ‘‘శ్రీవారి ఆలయంలో ఆగస్టు 11 నుంచి 16 వరకు …

Read More »

అత్యాచారం కేసులో ఇద్దరికి 20ఏళ్ల జైలు

ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు 20ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తిరుపతి నాల్గో అదనపు జిల్లా సెషన్సు న్యాయమూర్తి జి.రాంగోపాల్‌ సోమవారం తీర్పు వెలువరించారు. కోర్టు ఏపీపీ విజయలక్ష్మి, లైజన్‌ భక్తవత్సలం, పోలీసు కన్నయ్య తెలిపిన ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. కడప జిల్లా రాజంపేట మండలం మండపల్లికి చెందిన బాధితురాలు ప్రస్తుతం రేణిగుంట కరకంబాడి తారకరామానగర్‌లోని తన తండ్రి వద్ద ఉంటోంది. ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహమైంది. …

Read More »

మహాసంప్రోక్షణలోనూ భక్తులను అనుమతించాలి: సీఎం

తిరుమల పుణ్యక్షేత్రంలో ఆగమ శాస్త్రానుసారమే పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తితిదే, సీఎంవో అధికారులను ఆదేశించారు. తిరుమల ఆలయంలో మహా సంప్రోక్షణపై ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం అధికారులతో చర్చించారు. గతంలో మహా సంప్రోక్షణలో పాటించిన నిబంధనలనే అనుసరించాలని సూచించారు. రోజుల తరబడి భక్తులు దర్శనానికి ఎదురుచూసేలా చేయరాదని అన్నారు. మహా సంప్రోక్షణ రోజుల్లో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని.., పూజాది కార్యక్రమాలకు …

Read More »

యానాం వద్ద కొనసాగుతున్న గాలింపు మృతదేహాలు సముద్రంలోకి కొట్టుకుపోయి ఉంటాయని అధికారుల అనుమానం

తూర్పు గోదావరి జిల్లా పశువుల్లంక పడవ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం సాయంత్రం సముద్ర తీరంలో బాలిక తిరుకోటి ప్రియ మృతదేహం లభ్యమైంది. గోదావరి ఉద్ధృతిగా ప్రవహిస్తుండటం, నాలుగు రోజల క్రితం పడవ మునిగి పోవడంతో గల్లంతైన వారు దిగువకు సముద్ర తీరంలోకి కొట్టుకుపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. దీంతో సహాయ బృందాలు ఈరోజు యానాం దిగువున సావిత్రి నగర్ భైరవపాలెం నుంచి గాలిస్తున్నాయి. …

Read More »