భారత్ నుంచి వెళ్లే గులాబీల్లో అత్యధిక భాగం బ్రిటన్‌కు చేరుకొంటాయి. ఆ తర్వాత స్థానాల్లో మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్‌లు ఉన్నాయి. ఇటీవలే మలేసియాకు భారత్ గులాబీల ఎగుమతి మొదలైంది. అప్పుడే ఇక్కడ భారత గులాబీలకు భారీ డిమాండ్ వచ్చింది. మహారాష్ట్రలోని తలేన్గావ్ ప్రాంతం నుంచి ఇవి అత్యధికంగా ఎగుమతి అవుతాయి. ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో చలి పెరగడంతో ప్రేమికుల దినోత్సవం నాటికి సగానికి పైగా మొగ్గలు పవ్వులుగా …
Read More »Business
ప్రకటనలు ఆపరు… దోపిడీ ఆగదు! ఉత్తుత్తి ప్రకటనలు చేసిన ఓఎల్ఎక్స్ నిరాటంకంగా సైబర్ నేరస్థుల మోసాలు
‘‘రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్.. మహీంద్రా కారు.. ఐఫోన్10ను సగం ధరలకే ఇస్తున్నాం…’ అంటూ ఓఎల్ఎక్స్ వెబ్సైట్లో ప్రకటనలు నిరంతరాయంగా వస్తున్నాయ్… ఇవన్నీ తప్పుడు ప్రకటనలని.. వీటిని చూసిన ప్రజలు అప్రమత్తమయ్యేలా సందేశాలు పంపుతామంటూ ఓఎల్ఎక్స్ యాజమాన్యం చెప్పిన మాటలన్నీ ఉత్తుత్తివేనని తేలింది. కొద్దినెలలుగా సైనికుల్లా పరిచయం చేసుకుని అంతర్రాష్ట్ర ముఠాలు ప్రజలను మోసం చేస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్న నేపథ్యంలో బాధితుల ఫిర్యాదులు పదుల సంఖ్యలో వస్తుండడంతో సైబర్ క్రైమ్ పోలీసులు …
Read More »కుప్పకూలిన టాటా మోటార్స్ షేర్లు
ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించడం ఆ సంస్థ షేర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో టాటా మోటార్స్ షేర్లు కుప్పకూలాయి. మార్కెట్ ఆరంభంలో నష్టాలతో ప్రారంభమైన షేర్లు.. కాసేపటికే భారీగా పతనమయ్యాయి. ఒక దశలో 20శాతానికి పైగా నష్టపోయాయి.క్రితం సెషన్లో బీఎస్ఈలో రూ. 182.90 వద్ద ముగిసిన షేరు విలువ నేటి ట్రేడింగ్‌లో రూ. 164.65 వద్ద …
Read More »లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం ఫ్లాట్‌గా మొదలై లాభాల్లోకి మళ్లాయి. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉదయం 9.42గంటల సమయానికి సెన్సెక్స్ 131 పాయింట్ల లాభంతో 37,107 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 11,091 వద్ద ట్రేడవుతున్నాయి. ఉదయం 11.45కు ఆర్బీఐ పరపతి విధాన సమీక్షపై ప్రకటన చేసే అవకాశం ఉంది. టాటామోటార్స్ షేర్లు 1శాతం లాభపడ్డాయి. డాలర్‌తో …
Read More »అర్ధ సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక నివేదిక త్వరలో బ్యాంక్ బోర్డు ముందుకు
ఆర్బీఐ ఆడిట్ శరవేగంగా జరుగుతోంది. అర్ధ సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక నివేదిక త్వరలో బ్యాంక్ బోర్డు ముందుకు రానుంది. ఇది అందగానే ఆర్బీఐ ప్రభుత్వానికి అందజేయాల్సిన మధ్యంతర డివిడెండ్‌ను నిర్ణయిస్తారు. 2018 జులై నుంచి డిసెంబర్ మధ్య కాలానికి బ్యాంక్ లెక్కలను గణిస్తున్నారు. ఆడిట్ కమిటీలోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ త్వరలో భేటీ కానున్నారు. ఈ భేటీలో వారు ఆరునెలల కాలానికి జరిగిన ఆడిట్ నివేదకను ఆమోదించనున్నారు.ఆర్బీఐలో తొలిసారి అర్ధ …
Read More »ఊపిరిపీల్చుకొన్న సుభాష్ చంద్ర..! వ్యక్తిగత హామీతో సంక్షోభానికి విరామం
జీ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్రతో కంపెనీ రుణదాతలు చెల్లింపులకు సంబంధించి బేషరతుగా వ్యక్తిగత పూచికత్తు కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించి రుణదాతల బృందానికి , జీ సంస్థకు మధ్య ఒక ఒప్పందం కూడా జరిగింది. దీని ప్రకారం రుణదాతల బృందానికి జీపై అపరిమిత అధికారాలు సంక్రమించాయి. రుణదాతలకు జీ గ్రూప్ దాదాపు రూ.13,500 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనికి గాను జీ ఎంటర్టైన్మెంట్, డిష్టీవీల్లో వాటాలను హామీగా ఇచ్చారు. …
Read More »వీటిలో పరిమిత నగదు ఉంచుకోవాలి కార్డ్ స్వైపింగ్కూ ఇదే వాడుకోవాలి యూపీఐ వాలెట్ అనుసంధానానికీ ఇదే అధికమొత్తం నగదుకు మరో ఖాతా మేలు
ప్రస్తుతం ఉద్యోగులందరికీ వేతనాలు, పదవీ విరమణ చేసిన వారికి పింఛన్లు దాదాపుగా బ్యాంక్ ఖాతాల్లోకే చేరుతున్నాయి. రూ.20,000కు మించి నగదుతో లావాదేవీ జరపకూడదని నిబంధన తెచ్చాక, రైతులకు కూడా పంట దిగుబడులకు సంబంధించి నగదును వారి బ్యాంక్ ఖాతాలకే జమ చేస్తున్నారు. ఇక వ్యాపారుల లావాదేవీలు చెప్పనవసరం లేదు. బ్యాంక్ ఖాతాల నుంచి ఆన్లైన్లో, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నగదును వేరే వారి ఖాతాలకు బదిలీ చేయడం, బిల్లుల చెల్లింపు, …
Read More »ఇది F2 బడ్జెట్
ఎన్నికలకు ముందు బడ్జెట్ కావడంతో చాలా మంది దాని కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. అనుకున్నట్లుగా అది తాయిలాలూ తీసుకొచ్చింది. ప్రారంభంలో వాటిని చూడగానే పెళ్లికి ముందు జీవితంలా హాయిగా.. సంతోషంగా అనిపించింది సగటు మదుపరికి. అయితే వాటి లోతు తెలిసే సరికి పెళ్లి తర్వాత కనిపించే ఇబ్బందులు కనిపించాయి. మొత్తం మీద చూస్తే మాత్రం పరిపూర్ణమైన మగాడి జీవితంలా.. తీపి చేదు కలయికల మధ్యంతర బడ్జెట్.. మధ్యేమార్గంలో ఉన్నట్లు అనిపించింది. …
Read More »కృత్రిమ మేధకు పెద్దపీట తెలుగు రాష్ట్రాల్లో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు మేలు
ఐటీ రంగానికి మేలు చేసే ప్రతిపాదనలు కొన్ని ప్రస్తుత బడ్జెట్లో ఉండటంతో హైదరాబాద్, విశాఖపట్టణం కేంద్రంగా ఐటీ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలకు లబ్ది చేకూరుతుందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో హైదరాబాద్ క్రియాశీలకంగా ఉన్న విషయం విదితమే. ఎగుమతుల పరంగా బెంగుళూరు తర్వాత అగ్రస్థానంలో హైదరాబాద్ ఉంది. వార్షిక ఎగుమతులు రూ.1 లక్ష కోట్లకు చేరువయ్యాయి. ఎన్నో దేశ, విదేశీ ఐటీ కంపెనీలు ఇక్కడి …
Read More »పడిపోయిన రూపాయి విలువ..
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొద్దిసేపటి ముందు రూపాయి విలువ పతనమైంది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్ ఆరంభమయ్యాక నిలకడగా ఉన్న రూపాయి విలువ ఆ తర్వాత 9 పైసలు పతనమైంది. దీంతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.71.17కు చేరింది. మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనుండటం, ముడి చమురు ధరలు పెరగడం వంటివి ప్రధాన కారణాలుగా నిలిచాయి. బడ్జెట్లో భారీ పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తుందనే అంచనాలతో రూపాయి బలహీనపడింది. గురవారం రూపాయి డాలర్‌తో పోలిస్తే …
Read More »