పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , September 18 2018
Breaking News
Home / International

International

International

వణికించిన సూపర్‌ టైఫూన్‌ ఫిలిప్పీన్స్‌లో 12 మంది మృతి ఈ ఏడాది ప్రపంచంలో ఇదే అతి పెద్ద తుపాను

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత సంవత్సరంలో అతి పెద్దదైన తుపాను శనివారం ఫిలిప్పీన్‌ను తాకింది. మంగ్‌ఖుట్‌ సూపర్‌ టైఫూన్‌గా పిలిచే ఈ తుపాను ధాటికి ఆ దేశ ఉత్తర తీర ప్రాంతం విలవిల్లాడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో విపత్తులు సంభవించే దేశంగా ఫిలిప్పిన్‌కు పేరుంది. దక్షిణ చైనా సముద్రం తీరాన ఉన్న ఈ దేశానికి ఏటా కనీసం 20 తుపాన్లు వస్తుంటాయి. తాజాది 15వది కావడం గమనార్హం. స్థానికంగా వీటిని ఓంపాంగ్‌ అని …

Read More »

భారత భూభాగంలోకి చైనా బలగాలు..! ఆగస్టులో మూడు సార్లు ప్రవేశించారట

నిబంధనలకు విరుద్ధంగా చైనా బలగాలు గత నెల సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించాయట. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో వాస్తవాధీన రేఖను దాటి దాదాపు 4కిలోమీటర్ల లోపలికి వచ్చాయట. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల సమాచారం.చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ బలగాలు ఆగస్టు 6, 14, 15 తేదీల్లో భారత భూభాగంలోకి ప్రవేశించాయని సదరు వర్గాలు తెలిపాయి. చమోలీ జిల్లాలోని బారాహొటి ప్రాంతంలో గల వాస్తవాధీన రేఖను దాటి దాదాపు …

Read More »

ట్రంప్‌-కిమ్‌ మళ్లీ భేటీ..! సమావేశానికి చర్చలు జరుగుతున్నాయన్న అమెరికా

అమెరికా, ఉత్తరకొరియా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల భేటీ యావత్‌ ప్రపంచాన్నే ఎంతో ఆసక్తికి గురిచేసింది. గతంలో ఉప్పూనిప్పూలా ఉండే వీరు తమ వైరాన్ని పక్కనబెట్టి స్నేహహస్తాన్ని చాటుకున్నారు. సింగపూర్‌ వేదికగా ఒకరికొకరు ఎదురుపడి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే తాజాగా ట్రంప్‌, కిమ్‌ మరోసారి భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం కోసం చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం తెలిపింది…

Read More »

చంద్రుడిపై అంతుచిక్కని సుడులు.. అగ్నిపర్వతాల క్రియాశీలతకు గుర్తులు!

చంద్రుడి ఉపరితలంపై కనిపించే సుడుల వంటి అంతుచిక్కని నిర్మాణాలు.. ఒకప్పటి అగ్నిపర్వతాల క్రియాశీలతకు గుర్తులని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అంతర్గతంగా ఉత్పత్తయ్యే అయస్కాంత క్షేత్రపు అవశేషాలుగానూ వాటిని పేర్కొన్నారు. చందమామపై పలుచోట్ల.. ప్రవాహాల కారణంగా ఏర్పడిన సుడుల వంటి నిర్మాణాలున్నాయి. వాటిలో ఒకటైన ‘రీనర్‌ గామా’ ప్రఖ్యాతిగాంచిన నిర్మాణం. దాని పొడవు దాదాపు 40 మైళ్లు. ఈ నిర్మాణాల ఆవిర్భావ గుట్టును ఛేదించేందుకుగాను అమెరికాలోని రట్జెర్స్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా విస్తృత …

Read More »

దక్షిణ సూడాన్‌లో కుప్పకూలిన విమానం 19 మంది దుర్మరణం

దక్షిణ సూడాన్‌లో ఆదివారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దేశ రాజధాని జుబా నుంచి యిరోల్‌ నగరానికి వెళ్తున్న ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో విమానంలో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 22 మంది ఉన్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఇటలీకి చెందిన ఓ వైద్యుడు ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారని.. మరో ఇద్దరి జాడ కనిపించడం లేదని తెలిపాయి.

Read More »

మా త్యాగాన్ని చైనా ప్రశంసించింది: పాక్‌ పాక్‌లో పర్యటిస్తున్న చైనా విదేశాంగ మంత్రి‌

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న తమ పోరాటాలు, త్యాగాలను చైనా ప్రశంసించిందని పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మూద్‌ ఖురెషి చెప్పుకొచ్చారు. పాక్‌ పర్యటనకు వెళ్లిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ.. ఈ రోజు షా మహ్మూద్‌ ఖురేషితో సమావేశమై ఇరు దేశాల ధ్వైపాక్షిక సత్సంబంధాల బలోపేతం, చైనా-పాక్‌ ఆర్థిక కారిడార్‌ (సీపీఈసీ)తో పాటు పలు అంశాలపై చర్చించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత పాక్‌తో చైనా చర్చలు …

Read More »

పాక్‌ నెత్తిన ట్రంప్‌ దెబ్బ రూ.2,100 కోట్ల ఆర్థిక సహాయం నిలిపివేత

ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన పాకిస్థాన్‌కు 300 మిలియన్‌ డాలర్ల (రూ.2,100 కోట్లు) ఆర్థిక సహాయాన్ని నిలిపివేయనున్నట్టు అమెరికా ప్రకటించింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రూపొందించిన నూతన దక్షిణాసియా విధానానికి మద్దతు తెలపకపోవడం, ఉగ్రవాద సంస్థలైన హక్కానీ నెట్‌వర్క్‌, లష్కర్‌ ఏ తోయిబాలపై కఠినంగా వ్యవహరించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్టు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌ స్పష్టం చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఈ నెల అయిదో …

Read More »

తీరు మారకుంటే డబ్ల్యూటీవో నుంచి బయటకే ట్రంప్‌ హెచ్చరిక

ప్రపంచ స్థాయి సంస్థలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన దాడుల పరంపరను కొనసాగిస్తున్నారు. తాజాగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)ను ఆయన ఎంచుకున్నారు. ఆ సంస్థ తన తీరును మార్చుకోకుంటే దాని నుంచి వైదొలుగుతామని హెచ్చరించారు. ఆ సంస్థ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందాన్ని ‘అత్యంత దారుణమైన వాణిజ్య ఒప్పందం’గా ఆయన అభివర్ణించారు. ‘‘గత ఏడాది పలు కేసుల్లో మేం గెలిచాం. దీనికి కారణం తెలుసా? మేం కేసులు గెలవకుంటే.. …

Read More »

అనుమతి లేకుండా ఆలయానికి రంగులెందుకేశారు? బటు కేవ్స్‌ ఆలయంపై నేషనల్‌ హెరిటేజ్ ఆగ్రహం

మలేషియాలోని హిందూ దేవాలయం బటుకేవ్స్‌ ఆలయంపై నేషనల్‌ హెరిటేజ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. 12 ఏళ్లకోసారి జరిగే కార్తికేయ ఉత్సవంలో భాగంగా ఆలయంతో పాటు మెట్లకు ఆకర్షణీయమైన రంగులేశారు. అయితే ఈ ఆలయ విశిష్టతల దృష్ట్యా దీనికి వారసత్వ గుర్తింపు దక్కింది. దీంతో తమ అనుమతి లేకుండా ఆలయానికి రంగులద్దినందుకు ఆలయ కమిటీపై నేషనల్‌ హెరిటేజ్‌ సంస్థ నిప్పులు చెరిగింది.

Read More »

చైనాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో 18మంది సజీవదహనం

చైనాలోని హార్బిన్‌ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ రిసార్ట్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగి 18 మంది సజీవదహనమయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.హార్బిన్‌లోని సన్‌ ఐలాండ్‌ రిసార్ట్‌ ప్రాంతంలో గల బెయ్‌లాంగ్‌ హాట్‌ స్ప్రింగ్‌ హోటల్‌లో శనివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. మొదట నాలుగో అంతస్తులో ప్రారంభమైన మంటలు కాసేపటికే భవనమంతా వ్యాపించాయి. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక …

Read More »