పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , January 23 2019
Breaking News
Home / Movies (page 2)

Movies

Movies

‘సముద్రఖని’

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సముద్రఖని ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారన్నది తాజా ఫిల్మ్‌నగర్‌ సమాచారం.  ఈ సినిమాలో ఆయన రామ్‌చరణ్‌ పాత్రకు బాబాయ్‌గా కనిపిస్తారట. ఇటీవలే ఫస్ట్‌ షెడ్యూల్‌ను కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం నెక్ట్స్‌ షెడ్యూల్‌ జనవరిలో స్టార్ట్‌ కానుంది. ఇందులో హీరోయిన్లుగా కీర్తీ సురేశ్, కియారా అద్వానీ పేర్లు వినిపిస్తున్నాయి.

Read More »

రానా పుట్టినరోజు వేడుకలో రామ్ చరణ్, అఖిల్‌!

నటుడు దగ్గుబాటి రానా నిన్న తన 34వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. ఈ వేడుక‌కి రామ్ చ‌ర‌ణ్‌, అఖిల్‌, సానియా మీర్జాతో పాటు ప‌లువురు సన్నిహితులు హాజరై సందడి చేశారు. పార్టీకి సంబంధించిన ఫోటోని రానా తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసి ‘నా వైపు నుండి ఎల్లప్పుడూ కొందరిని మిస్ అవుతూ ఉంటాను. కానీ, నా జీవితాన్ని ఆనందంగా మార్చినందుకు ధన్యవాదాలు’ అంటూ ఓ కామెంట్ …

Read More »

శ్రీదేవి ఉండుంటే.. సినిమాను ముందు ఆమెకే చూపించేవాడిని: షారుక్‌ ఖాన్

అలనాటి తార శ్రీదేవి ఉండుంటే ‘జీరో’ చిత్రాన్ని ముందు ఆమెకే చూపించి ఉండేవాడినని అంటున్నారు బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. ఆనంద్‌ ఎల్ రాయ్‌ దర్శకత్వం వహించారు. కత్రినా కైఫ్‌, అనుష్క శర్మ కథానాయికలుగా నటించారు. ఇందులో షారుక్‌ మరుగుజ్జు పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రంలో శ్రీదేవి అతిథి పాత్రలో నటించారు. ఆమె నటించిన చివరి చిత్రమిది. ఈ విషయం గురించి …

Read More »

తలైవాకు శుభాకాంక్షల వెల్లువ

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈరోజు తన 68వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సోషల్‌మీడియాలో తలైవాకు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఈ ఏడాది రజనీ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. ఇటీవల రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన గజ తుపాను తననెంతో బాధకు గురిచేసిందని, అందుకే పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని రజనీ తన అభిమానులతో అన్నారట...

Read More »

‘టాక్సీవాలా’ బ్లాక్‌బస్టర్‌ రైడ్‌‌! ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసా?

యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం బాక్సాఫీసు వద్ద చక్కటి విజయం సాధించింది. నవంబరు 16న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది. ఈ చిత్రం తొలివారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.27.83 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకులు చెప్పారు. తొలి రోజున దాదాపు రూ.10 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండో రోజు దాదాపు రూ.7 కోట్లు రాబట్టిందని పేర్కొన్నారు. మొత్తం ఆరు రోజుల్లో …

Read More »

‘యన్‌టిఆర్‌’లో ‘ఆర్‌ఎక్స్‌ 100’ భామ

‘ఆర్‌ ఎక్స్‌ 100’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్నారు నటి పాయల్‌ రాజ్‌పుత్‌. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసులు దోచుకున్న పాయల్‌కు వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే తమిళం, తెలుగులో కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు పాయల్‌కు ప్రముఖ దర్శఖుడు క్రిష్‌ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌లో నటించే బంపర్‌ ఆఫర్‌ దక్కినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇప్పటికే ఎవరెవరు యేయే పాత్రల్లో ఎవరు నటిస్తున్నారన్న విషయంపై కొంతమేర …

Read More »

అబ్బాయిని చూడమని చెప్పాను అదే నా కల: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌‌

తాను ఇప్పటికీ ఎందుకు సింగిల్‌గా ఉన్నానో తెలీడంలేదని, అబ్బాయిని చూడమని చెప్పానని అంటున్నారు కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు రకుల్‌.నటీనటులకు జయాపజయాలు సర్వసాధారణమే. నా సినిమా హిట్టైతే శుక్రవారం రాత్రి నా స్నేహితులు, కుటుంబీకులతో కలిసి పార్టీ చేసుకుంటా. ఫ్లాపైనా కూడా ఇలాగే సెలబ్రేట్‌ చేసుకుంటా. ఎందుకంటే ఒక్క అవకాశమైనా దొరక్కపోదా అని ఎదురుచూస్తున్నవారు బయట చాలా మంది ఉన్నారు. …

Read More »

రజనీకాంత్‌ విరాళం రూ.50 లక్షలు

‘గజ’ తుపాను బాధితుల సహాయార్థం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రూ.50 లక్షల సహాయం ప్రకటించారు. ఇప్పటికే సూర్య కుటుంబం, జీవీ ప్రకాశ్‌, విజయ్‌సేతుపతిలు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరితోపాటు పలువురు నటులు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.50 లక్షల విరాళాన్ని రజనీ ప్రకటించారు. ఈ మొత్తంలో సహాయకాలను అందజేయనున్నట్లు సంబంధిత వర్గాలు ప్రకటించాయి. ఇదిలా ఉండగా శివకార్తికేయన్‌ రూ.20 లక్షల విరాళం ప్రకటించారు. ఇందులో రూ.10 …

Read More »

అతిథులకు దీప్‌వీర్‌ ప్రత్యేక కానుక

బాలీవుడ్‌ కొత్త జంట దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ ఇద్దరూ ఇప్పుడు పండగ వాతావరణంలో ఉన్నారు. ఇటీవల ఇటలీలో వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయిన విషయం తెలిసిందే. లేక్‌కోమో వేదికగా వీరి పెళ్లి జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరిగిన ఈ తంతుకు వచ్చిన అతిథులకు ప్రత్యేక కానుక ఇచ్చారట. దీప్‌వీర్‌జంట తమ పెళ్లికి అత్యంత సన్నిహితులను మాత్రమే పిలిచారు. ఈ వివాహానికి హాజరైన అతిథులకు ఫొటో ఫ్రేమ్‌, వచ్చినందుకు …

Read More »

ముంబయి చేరుకున్న ‘దీప్‌వీర్‌’

బాలీవుడ్‌ నూతన జంట దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ ఈరోజు ఉదయం ముంబయి చేరుకున్నారు. ఇటీవల ఇటలీలో వివాహ బంధంతో ఒక్కటైన దీపిక, రణ్‌వీర్‌కు ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం దక్కింది. ఫొటోగ్రాఫర్లు వారిద్దరి ఫొటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ సవ్యసాచి డిజైన్‌ చేసిన సల్వార్‌ కమీజ్‌, షేర్వాణీలు ధరించారు‌. తన ప్రియమైన సతీమణిని రణ్‌వీర్ తన ఇంటికి తీసుకెళ్లి గృహప్రవేశం చేయించినట్లు తెలుస్తోంది.

Read More »