పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , September 18 2018
Breaking News
Home / National

National

National

వారణాశిలో మోదీ జన్మదిన వేడుకలు పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన 68వ జన్మదినోత్సవాన్ని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి నియోజకవర్గంలో గడిపారు. పాఠశాలలో చిన్నారులతో ముచ్చటించారు. వారణాశిలో మోదీ పలు పాఠశాలల విద్యార్థులతో సంభాషించారు. ‘‘ప్రశ్నలు సంధించడం విద్యార్థులకు చాలా ముఖ్యం. ఈ విషయంలో ఎన్నడూ భయపడకండి’’ అని పేర్కొన్నారు. అనేకరకాల నైపుణ్యాలను అలవర్చుకోవాలని, అవి జీవితాంతం  ఉపయోగపడతాయని సూచించారు. ప్రధాని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారణాశిలో 68 కిలోల బరువున్న 68 కేకులను 68 …

Read More »

అంగన్‌వాడీ కార్యకర్తల ఆకాంక్షలు నేరవేర్చాం 25 లక్షల మందికి లబ్ధి : జైట్లీ

దేశంలో 25 లక్షల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల చిరకాల డిమాండ్‌ను నెరవేరుస్తూ.. వారి గౌరవ వేతనాన్ని 50% పెంచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ శనివారం పేర్కొన్నారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల గౌరవ వేతనాన్ని పెంచుతూ కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం విజయవంతంగా చేపడుతున్న కార్యక్రమాలను ఫేస్‌బుక్‌ వేదికగా జైట్లీ వివరించారు. ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వాలు అంగన్‌వాడీలకు …

Read More »

పరిశుభ్ర భారత్‌ కోసం పునరంకితమవుదాం ప్రధాని మోదీ పిలుపు

స్వచ్ఛతే సేవ ఉద్యమాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మాట్లాడారు. దేశంలో గాంధీ కలలను సాకారం చేయడమే ఉద్యమ లక్ష్యమని వివరించారు. అక్టోబర్‌ 2 వరకు పరిశుభ్ర భారత్‌ కోసం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన స్వచ్ఛభారత్‌ ఈ రోజు కీలక దశకు చేరుకుందని ప్రధాని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యం అపూర్వమని పేర్కొన్నారు. …

Read More »

దిల్లీ ఎయిమ్స్‌కు గోవా సీఎం పారికర్‌

అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్‌ మెరుగైన వైద్యం కోసం నేడు దిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఈ ఉదయం పారికర్‌ ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్తారని గోవా సీఎంవో కార్యాలయం తెలిపింది. ఈ ప్రత్యేక విమానాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. కాగా.. పారికర్‌ ఆరోగ్య సమస్యల దృష్ట్యా తరచూ ఆయన విధులకు సెలవు పెట్టాల్సి వస్తోంది. దీంతో పాలనా వ్యవస్థ దెబ్బతింటోందని …

Read More »

సరదాల దసరాకు చురుగ్గా ఏర్పాట్లు గోడపత్రికలు, వెబ్‌సైట్‌ ప్రారంభం

దసరా ఉత్సవాలు సమీపించడంతో రాచనగరిలో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. శుక్రవారం ఇక్కడి జిల్లాధికారి కార్యాలయంలో బాధ్య మంత్రి జి.టి.దేవెగౌడ నేతృత్వంలో ఏర్పాట్లను ముమ్మరం చేసే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా గోడపత్రికలు, వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని తీర్మానించారు. ఉత్సవాల్లో 13ఏళ్ల తరువాత వింటేజ్‌ కార్ల ర్యాలీని నిర్వహిస్తారు. ర్యాలీతో పాటు ఈ కార్లను చూసేందుకు వీలుగా ప్యాలెస్‌ ప్రాంగణంలో నిలిపి ఉంచాలని నిర్ణయించారు. సమావేశంలో పర్యాటకశాఖ మంత్రి సా.రా.మహేష్‌, …

Read More »

కశ్మీరులో లోయలో పడిన మినీబస్సు కనీసం 17 మంది మృతి

కిష్వర్‌ జిల్లాలో శుక్రవారం ఓ మినీబస్సు మూడువందల అడుగులకుపైగా లోతున ఉన్న లోయలో పడిపోయిన దుర్ఘటనలో డ్రైవరుతో సహా కనీసం 17మంది మరణించారు. 16 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కేష్వాన్‌ ప్రాంతం నుంచి కిష్వర్‌ వెళుతున్న మినీ బస్సు దనదరన్‌ వద్ద చీనాబ్‌ నదీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. అక్కడికి వచ్చే సరికి డ్రైవరు ఒక్కసారిగా బస్సుపై నియంత్రణ కోల్పోయారు. అదుపుతప్పి లోయలోకి పడిపోయింది.

Read More »

పలు రాష్ట్రాల్లో భూకంపం భయంతో పరుగులు తీసిన ప్రజలు

అసోం, బిహార్‌, పశ్చిమ్‌ బంగా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదయిందని అధికారులు తెలిపారు. సుమారు 15 నుంచి 20 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయని వివరించారు. ఈశాన్య రాష్ట్రం అసోంలోని కోక్రఝర్‌ నగరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించినట్లు షిల్లాంగ్‌లోని కేంద్రీయ భూకంపాల అధ్యయన సంస్థ ప్రకటించింది. పశ్చిమ్‌ బంగాలో ఏకంగా ఆరు జిల్లాల్లో …

Read More »

భారత్‌కు తీవ్ర ముప్పు.. రాఫెల్‌ ఎంతో అవసరం వాయు సేనాధిపతి బీఎస్‌ ధనోవా

భారత్‌కు తీవ్ర ముప్పు ఉందని, దాన్ని ఎదుర్కొనేందుకు రాఫెల్‌ లాంటి యుద్ధ విమానాలు ఎంతో అవసరం అని అంటున్నారు వాయు సేనాధిపతి మార్షల్‌ బీఎస్‌ ధనోవా. ప్రత్యర్థి దేశాలకు అనుగుణంగా మన దేశ సామర్థ్యాన్ని పెంచుకోవాలని చెప్పారు. ‘భారత వైమానిక దళం ఫోర్స్‌ స్ట్రక్చర్‌ 2035’ సెమినార్‌లో పాల్గొన్న ధనోవా ఈ వ్యాఖ్యలు చేశారు…    

Read More »

పెట్రోల్‌, డీజిల్‌.. నేడూ పరుగులే

 గత కొన్ని రోజులుగా చుక్కలను తాకుతున్న చమురు ధరలు మంగళవారం కూడా పెరిగాయి. దీంతో పాత రికార్డులను చెరిపేస్తూ సరికొత్త గరిష్ఠాలకు చేరాయి. దేశ రాజధానిలో నేడు లీటర్‌ పెట్రోల్‌ ధర 14 పైసలు పెరిగి రూ. 80.87గా ఉంది. ఇక చమురు ధరలు అత్యధికంగా ఉండే ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 88.26కు చేరింది. కోల్‌కతాలో రూ. 83.75, చెన్నైలో రూ. 84.05, హైదరాబాద్‌లో రూ. 85.75గా …

Read More »

జడ్జీల నియామకాన్ని వేగవంతం చేయండి హైకోర్టులను కోరిన కేంద్రం

దిగువ కోర్టుల్లో జడ్జీల నియామక ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా హైకోర్టులను కేంద్రప్రభుత్వం కోరింది. అపరిష్కృత కేసులు పేరుకుపోతుండటానికి.. జడ్జీల కొరత కూడా ఓ కారణమని సూచించింది. మొత్తం 24 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ మేరకు గత నెల 14న లేఖ రాశారు. దేశవ్యాప్తంగా జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో 2,76,74,499 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని అందులో సూచించారు. విచారణ ప్రక్రియలో ఈ అనుచిత …

Read More »