పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , January 23 2019
Breaking News
Home / National (page 2)

National

National

శబరిమల వివాదంలో ఎల్డీఎఫ్‌ సర్కారు తీరు సిగ్గుచేటు యూడీఎఫ్‌ది రోజుకో మాట ప్రధాని మోదీ విమర్శ

శబరిమల ఆలయ వివాదంలో కేరళలోని సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వ వ్యవహార శైలిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఏ పార్టీగానీ, ఏ ప్రభుత్వంగానీ వ్యవహరించని రీతిలో అత్యంత సిగ్గుచేటుగా ప్రవర్తించడం చరిత్రలో నిలిచిపోతుందని విమర్శించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ పలురకాల వైఖరిని ప్రదర్శించిందంటూ దుయ్యబట్టారు. మతతత్వం, అవినీతి, కులతత్వం విషయంలో ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ ఒకే నాణేనికి రెండు ముఖాలని ఆరోపించారు. మంగళవారం ప్రధాని మోదీ కేరళలో 13 …

Read More »

కుంభమేళా కేంద్రంలో అగ్నిప్రమాదం 2 వాహనాలు, 9 టెంట్లు దగ్ధం

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ఉత్సవం జరగనున్న ఓ కేంద్రం వద్ద సోమవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ‘దిగంబర్‌ అనీ అఖాడా’ వద్దగల శిబిరంలో వంటగ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఫలితంగా అక్కడి వేదికతోపాటు రెండు వాహనాలు, 9 టెంట్లు, కొంత సామగ్రి దగ్ధమయ్యాయి. అగ్నిమాపక దళం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు స్పందించి మంటలను ఆర్పివేశాయి. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. అన్ని …

Read More »

సుప్రీం కోర్టులో భాజపాకు ఎదురుదెబ్బ రథయాత్ర చేపట్టొద్దని ఆదేశం

పశ్చిమ బంగలో భారీ రథ యాత్ర చేపట్టాలనుకొంటోన్న భాజపాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ యాత్రపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాల దృష్ట్యా ప్రస్తుతానికి యాత్ర చేపట్టొద్దని సుప్రీంకోర్టు భాజపాను ఆదేశించింది. అవసరమైతే మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యక్తపర్చిన అభ్యంతరాలకు తగ్గట్లుగా ప్రణాళిక మార్చుకొని యాత్ర జరుపుకొనేందుకు, తిరిగి ప్రభుత్వాన్ని అనుమతి కోరవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, పశ్చిమ బంగలో ర్యాలీలు, …

Read More »

మళ్లీ భగ్గుమంటున్న ఇంధన ధరలు

అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో దేశంలో ఇంధన ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. వరుసగా ఐదో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్‌ ధర మళ్లీ రూ. 70 మార్క్‌ను దాటింది. కొత్త ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం ఆరు సార్లు ఇంధన ధరలు పెరిగాయి.ప్రధాన ఇంధన కంపెనీలు సోమవారం పెట్రోల్‌పై 37-40 పైసలు, డీజిల్‌పై 49-53పైసలు పెంచాయి. దీంతో దిల్లీలో లీటర్‌ …

Read More »

10% కోటాకు రాష్ట్రపతి ఆమోదం 103వ రాజ్యాంగ సవరణగా గుర్తింపు

జనరల్‌ కేటగిరీలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లు చట్టరూపం సంతరించుకొంది. దీనిపై శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేయడంతో చట్టంగా మారింది. 124వ రాజ్యాంగసవరణ బిల్లుగా పార్లమెంటు ఆమోదం పొందిన ఈ అంశం రాష్ట్రపతి ఆమోదముద్రతో 103వ రాజ్యాంగ సవరణ చట్టంగా రూపాంతరం సంతరించుకొంది. రిజర్వేషన్ల కల్పన కోసం రాజ్యాంగంలోని 15, 16 అధికరణాలను సవరించాల్సి వచ్చింది. …

Read More »

రాజస్థాన్‌ సీఎంగా అశోక్‌ గహ్లోత్‌ ప్రమాణస్వీకారం

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గహ్లోత్‌ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. జయపురలోని చారిత్రక ఆల్బర్ట్‌ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గహ్లోత్‌ చేత గవర్నర్‌ కల్యాణ్‌ సింగ్‌ ప్రమాణం చేయించారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Read More »

2 నెలల తర్వాత పెరిగిన పెట్రోల్‌ ధర

దాదాపు రెండు నెలల తర్వాత దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రధాన నగరాల్లో సోమవారం పెట్రోల్‌ ధర 19-20 పైసలు, డీజిల్‌ ధర 9 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 70.53, డీజిల్‌ ధర రూ. 64.67 పైసలు పలికింది.ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 76.15, కోల్‌కతాలో రూ. 72.62, చెన్నైలో రూ. 73.19గా ఉంది. …

Read More »

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను రేపు కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరందాటే అవకాశం

బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాను క్రమంగా తీరం వైపు కదులుతోంది. ఈ తుపాను కాకినాడ-మచిలీపట్నం మధ్య రేపు తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనాలు వేసిన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. ప్రస్తుతం ఈ తుపాను కాకినాడకు 670 కి.మీ.దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. కాగా, పెథాయ్ తుపాను తీరంవైపు దూసుకొస్తున్న తరుణంలో దాని ప్రభావం ప్రారంభమయింది.

Read More »

అతివల మృతదేహాలను చుట్ట చుట్టి తెస్తుంటే చూడలేము: ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్

అతివల మృతదేహాలను చుట్టగా చుట్టి తీసుకు వస్తుంటే చూసేందుకు భారతావని సిద్ధంగా లేదని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. మైనింగ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లో మహిళా ఉద్యోగుల నియామకాలు కొనసాగుతాయని చెప్పిన ఆయన, యుద్ధంలో ముందు నిలబెట్టి, వారితో పోరాడించేందుకు మాత్రం వ్యతిరేకమని చెప్పారు. “పిల్లలకు తల్లిగా ఉన్న ఓ మహిళ మరణించదని నేను చెప్పను. ఆమె రోడ్డు ప్రమాదంలో అయినా చనిపోవచ్చు. అదే యుద్ధంలో …

Read More »

మోదీ గారూ.. హెచ్1బీ సమస్యను పరిష్కరించండి!: ప్రధానికి పవన్ కల్యాణ్ లేఖ

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులతో ఆయన భేటీ అవుతున్నారు. తాజాగా అగ్రరాజ్యంలో ఉన్న తెలుగువారితో సమావేశమైన పవన్ కల్యాణ్, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమెరికాలో నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకు అందించే హెచ్1బీ వీసాల జారీ నిబంధనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠినతరం చేసిన విషయాన్ని పవన్ …

Read More »