పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , October 17 2018
Breaking News
Home / National (page 3)

National

National

తొలిసారిగా రోహింగ్యాల తరలింపు ఏడుగురిని మయన్మార్‌కు అప్పగించిన భారత్‌

భారత్‌ తొలిసారిగా ఏడుగురు రోహింగ్యాలను వారి సొంత దేశమైన మయన్మార్‌కు గురువారం పంపించి వేసింది. రోహింగ్యాల తరలింపునకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన వెంటనే అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. చట్టవిరుద్ధంగా వలస వచ్చిన ఈ ఏడుగురినీ 2012లో అసోంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సిల్‌చార్‌(అసోం)లోని కేచర్‌ కేంద్ర కారాగారంలో ఉంచారు. మయన్మార్‌లోని రాకైన్‌ రాష్ట్రంలో వారి చిరునామాలను ఆ దేశ ప్రభుత్వం పరిశీలించిన అనంతరం వారికి అక్కడి పౌరసత్వం …

Read More »

కరోడ్‌పతి బినీతా రూ.కోటి గెలుచుకున్న గువాహటి వాసి

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమంలో గువాహటికి చెందిన బినీతా జైన్‌ కోటి రూపాయలు గెలుచుకున్నారు మంగళవారం నాటి ఎపిసోడ్‌లో అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంతో ఆమెను ఈ అదృష్టం వరించింది. బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం పదో సీజన్‌ నడుస్తోంది. భారత్‌లో ఏ కేసును 13 మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది?’ అన్న ప్రశ్నకు ఆమె సరైన సమాధానం చెప్పారు. …

Read More »

రోహింగ్యాల తరలింపునకు సుప్రీం ఓకే

ఏడుగురు రోహింగ్యా శరణార్థులను తిరిగి వారి మాతృదేశానికి పంపించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ మేరకు వీరి తరలింపుపై వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రోహింగ్యాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఏడుగురు 2012 నుంచి అసోంలో అక్రమంగా నివాసముంటున్నారు. కొన్నాళ్ల పాటు జైలు శిక్ష కూడా అనుభవించిన వీరు ప్రస్తుతం సిల్చార్‌లోని ఓ శిబిరంలో ఉంటున్నారు. వీరి …

Read More »

ప్రజల భాగస్వామ్యంతోనే సంపూర్ణ పారిశుద్ధ్యం ‘స్వచ్ఛ భారత్‌’ను అతిపెద్ద ఉద్యమంగా మార్చింది గ్రామీణులే: ప్రధాని మోదీ

ప్రభుత్వ నిధులతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా తోడైతే… సంపూర్ణ పారిశుద్ధ్యం సుసాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. నాలుగేళ్ల క్రితం వరకూ ప్రపంచ వ్యాప్తంగా బహిరంగ మలవిసర్జన చేసేవారిలో భారతీయులు 60% ఉండేవారనీ, ఇప్పుడు వారి సంఖ్య 20% కంటే తక్కువే ఉందన్నారు. బాపూ జయంతి సందర్భంగా- మంగళవారం ఆయనిక్కడ ‘మహాత్మాగాంధీ అంతర్జాతీయ పారిశుద్ధ్య సదస్సు’ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్‌) పట్టణాల్లో పారిశుద్ధ్య పరిస్థితిని …

Read More »

జాతిపితకు నివాళులర్పించిన ప్రముఖులు

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. దిల్లీలోని రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా పలువురు ప్రముఖులు మహాత్ముడికి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహానీయుడు మహాత్మాగాంధీ అని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. …

Read More »

తమిళనాడులో మరోసారి ఐసిస్‌ కలకలం కడలూరు కారాగారంపై దాడికి కుట్ర రాష్ట్ర పోలీసులకు ఎన్‌ఐఏ హెచ్చరిక

కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో తమిళనాడులో రాష్ట్రంలో మరోసారి ఐసిస్‌ కలకలం రేగింది. తమ సభ్యుడు అన్సర్‌ మీరన్‌ను విడుపించుకునేందుకు కడలూరు కేంద్ర కారాగారంపై దాడికి ఆ సంస్థ తీవ్రవాదులు కుట్ర పన్నారని కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) హెచ్చరించడమే దీనికి కారణం. అప్రమత్తమైన పోలీసులు కారాగార ప్రాంగణంలో భద్రత పెంచారు. కన్యాకుమారి జిల్లా తిరువిదన్‌కాడ్‌కు చెందిన అన్సర్‌ మీరన్‌ ఐసిస్‌ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నట్లు తెలియడంతో ఇటీవల ఎన్‌ఐఏ అరెస్టు …

Read More »

గాంధీ అంటే కదల్లేని విగ్రహం కాదు: రాహుల్‌

గాంధీజీ అంటే కదల్లేని విగ్రహం కాదని.. దేశమంతా విస్తరించిన విలువలు, జీవించి ఉన్న ఆలోచనలు అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. నేడు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాహుల్‌ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా రాహుల్‌ ట్విటర్‌లో గాంధీ ఫొటోతో పాటుగా ట్వీట్‌‌ చేశారు. ‘గాంధీజీ అంటే కదలలేని విగ్రహం కాదు, దేశమంతా విస్తరించి ఉన్న విలువలు, …

Read More »

చెన్నైలో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేడుకల నిమిత్తం వచ్చే వాహనాలను నగర పోలీసు విభాగం ఎక్కడికక్కడ మళ్లించనుంది. ఈ మేరకు చెన్నై పోలీసు కమిషనరేట్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. తిరువళ్లూరు, కాంచీపురం, తిరువణ్ణామలై, విల్లుపురం, కడలూరు, వేలూరు నుంచి వచ్చేవారు మెరీనాలో తమ వాహనాలను పార్కింగ్‌ చేయాలని పోలీసులు తెలిపారు. కృష్ణగిరి, ధర్మపురి, పుదుకొట్టై, కరూర్‌, అరియలూర్‌, పెరంబలూర్‌, తిరుచ్చి నుంచి వచ్చే వాహనాలు ఓఎంఆర్‌ రోడ్డు, మహాబలిపురం …

Read More »

భారత్‌లో వ్యతిరేక గళాలపై దాడులు ‘పెన్‌ ఇంటర్నేషనల్‌’ వ్యాఖ్య

భారత ప్రభుత్వం తమ రచయితలు, విలేఖరులు, భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకుంటున్నవారికి భద్రత కల్పించాలని అంతర్జాతీయ రచయితల సంఘం ‘పెన్‌ ఇంటర్నేషనల్‌’ కోరింది. గత కొన్నేళ్లలో దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు అనువైన వాతావరణం బాగా దెబ్బతిందని శనివారం ఇక్కడ ముగిసిన సంఘం 84వ కాంగ్రెస్‌ పేర్కొంది. పెన్‌ ఇంటర్నేషనల్‌ ఏటా ఒక్కో దేశంలో ఈ సదస్సును నిర్వహిస్తుంటుంది. ఆ సందర్భంగా సదరు దేశంలోని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఒక …

Read More »

కేరళకు సాయంగా రూ.43.66 కోట్ల ఎంపీలాడ్స్‌ నిధులు

వరదల్లో దెబ్బతిన్న కేరళ సహాయ, పునర్నిర్మాణ పనులకు పార్లమెంట్‌ ఉభయసభలకు చెందిన 100 మంది సభ్యులు రూ.43.66 కోట్ల ఎంపీలాడ్స్‌ నిధుల్ని కేటాయించారు. 56 మంది రాజ్యసభ సభ్యులు రూ.29.82 కోట్లు, 44 మంది లోక్‌సభ సభ్యులు రూ.13.84 కోట్ల నిధులు సాయంగా కేటాయించినట్లు గణాంక, కార్యక్రమాల అమలు శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడ తెలిపారు.

Read More »