పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , August 14 2018
Breaking News
Home / Sports (page 2)

Sports

Sports

పాండ్య కాదు కుల్‌దీప్‌: భజ్జీ

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను ఆడించాలని టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ సూచించాడు. లార్డ్స్‌లో ఒకవేళ టాస్‌ ఓడి కోహ్లీసేన బౌలింగ్‌కు దిగితే కుల్‌దీప్‌ అవకాశాలు సృష్టించగలడని పేర్కొన్నారు. బ్యాట్స్‌మెన్‌ కుడిచేతి వాటమైనా ఎడమచేతి వాటమైనా అతడు రెండు వైపుల నుంచి టర్న్‌ రాబట్టగలడని వెల్లడించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా యాజమాన్యం స్థానిక పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమైందని విశ్లేషించాడు.

Read More »

ప్రపంచకప్‌ వచ్చేస్తోంది ప్రమోషనల్‌ వీడియో విడుదల చేసిన ఐసీసీ‌

వచ్చే ఏడాది 2019లో జరగబోయే ప్రపంచకప్‌ కోసం ఐసీసీ ఇప్పటి నుంచే సన్నాహలు ప్రారంభించింది. ఈ క్రమంలో ఓ ప్రత్యేక ప్రమోషనల్‌ వీడియోను ఐసీసీ ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇప్పుడు ఈ గీతం ప్రపంచవ్యాప్తంగా కుర్ర కారును ఉర్రూతలూగిస్తోంది.

Read More »

అనుష్క శర్మ… టీమిండియా వైస్‌ కెప్టెనా? సామాజిక మాధ్యమాల్లో బీసీసీఐపై అభిమానుల ఆగ్రహం

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మతో పాటు, బీసీసీఐపై నెటిజన్లు మండిపడుతున్నారు. అనుష్క ఏమైనా టీమిండియా వైస్‌ కెప్టెనా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా బీసీసీఐ ఓ ఫొటోను పంచుకోవడమే ఇందుకు కారణం. ఇంతకీ బీసీసీఐ పంచుకున్న ఆ ఫొటో ఏంటా? అని ఆలోచిస్తున్నారా. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. …

Read More »

మొదలైంది.. సచిన్‌ అకాడమీ

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ సారథ్యంలో ఇంగ్లాండ్‌ వేదికగా క్రికెట్‌ అకాడమీ మొదలైంది. కౌంటీ జట్టు మిడిలెసెక్స్‌తో కలిసి అతను ఈ అకాడమీని నడపనున్నాడు. తెందుల్కర్‌ మిడిలెసెక్స్‌ గ్లోబల్‌ అకాడమీ పేరుతో ప్రారంభమైన ఈ శిక్షణ కేంద్రంలో సోమవారం నుంచి చిన్నారులకు పాఠాలు షురూ చేశారు. 9 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు ఈ అకాడమీ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. నాణ్యమైన క్రికెటర్లను తయారు చేయడమే తమ …

Read More »

నాకు ఫైనల్‌ ఫోబియా లేదు భవిష్యత్‌లో స్వర్ణపతకం తప్పక గెలుస్తా స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించడం సంతోషంగా ఉందని స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు అన్నారు. స్వర్ణ పతకం సాధించేందుకు శతవిధాలా కృషి చేశానని… తొలి రౌండ్‌లో మారిన్‌కు గట్టి పోటీ ఇవ్వగలిగానని సింధు అన్నారు. చైనాలో ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో సింధు రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం స్వదేశానికి చేరుకున్న సింధు మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో మీడియాతో మాట్లాడారు.

Read More »

మరోసారి ఫైనల్లో ఓడిన సింధు స్వర్ణం మారీన్‌ సొంతం

పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో మరే భారత షట్లర్‌కు సాధ్యం కాని రీతిలో నాలుగో పతకమైతే అందుకుంది కానీ.. స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాలన్న ఆమె ఆశ మాత్రం నెరవేరలేదు. మహిళల సింగిల్స్‌లో వరుసగా రెండో ఏడాది కూడా సింధు రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఆదివారం ఫైనల్లో ఆమె 19-21, 10-21తో స్పెయిన్‌ స్టార్‌ కరోలినా మారీన్‌ చేతిలో పరాజయం చవిచూసింది. మ్యాచ్‌ను బాగానే ఆరంభించి.. తొలి గేమ్‌లో చాలా …

Read More »

టెస్టుల్లోనూ కోహ్లీదే అగ్రస్థానం

రికార్డుల రారాజు టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత్‌ తరపున ఈ ఘనత సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో మొత్తం 200 పరుగులు చేసిన కోహ్లి.. ఐసీసీ ఆదివారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 31 పాయింట్లు మెరుగుపర్చుకొని మొత్తం 934 పాయింట్లతో అగ్రస్థానాన్ని అధిరోహించాడు.

Read More »

సింధు నాదం పతకం ఖాయం చేసుకున్న తెలుగమ్మాయి క్వార్టర్స్‌లో ఒకుహరపై సింధు గెలుపు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పతకం.. ప్రతి ఒక్క షట్లర్‌ కల.. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పతకాలు గెలిచేసింది సింధు. ఇప్పటికే మూడు పతకాలు నెగ్గిన ఈ తెలుగుతేజం.. తాజా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మరో పతకాన్ని ఖాయం చేసుకుని రికార్డు సృష్టించింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆమె సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. తనకు ప్రతి టోర్నీలోనూ పెద్ద అడ్డంకిగా మారుతున్న నొజొమి ఒకుహర (జపాన్‌)ను ఓడించి ముందంజ వేయడం విశేషం. …

Read More »

కోహ్లీ కోసమే కిమ్‌-ట్రంప్‌ వచ్చారు ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో ఆసక్తికర సన్నివేశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఉత్తర‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ క్రికెట్‌ మైదానంలో కలిశారు. ఒకరినొకరు పలకరించుకున్నారు. అంతేకాదు కరచాలనం కూడా చేసుకున్నారు. బర్మింగ్‌హామ్‌ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో చోటు చేసుకుంది ఈ సన్నివేశం. టెస్టు మ్యాచ్‌ చూసేందుకు ట్రంప్‌-కిమ్‌ ఎందుకు వస్తారని అనుకుంటున్నారు కదూ..!. అయితే వారి వేషధారణలో అభిమానులే వచ్చి అలరించారు.

Read More »

వైష్ణవి ముందంజ అఖిల భారత సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌

యోనెక్స్‌ సన్‌రైజ్‌ అఖిల భారత సబ్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో వైష్ణవి (తెలంగాణ) ముందంజ వేసింది. గురువారం జరిగిన అండర్‌-15 బాలికల సింగిల్స్‌ మూడో రౌండ్లో వైష్ణవి 9-15, 15-9, 15-7తో ఉపాసన (దిల్లీ)పై నెగ్గింది. అండర్‌-17 బాలుర సింగిల్స్‌ మూడో రౌండ్లో కార్తీక్‌ (ఆంధ్రప్రదేశ్‌) 10-15, 15-11, 15-11తో జాఫరీ (కేరళ)పై, సూర్య (తెలంగాణ) 15-13, 15-12తో ప్రణవ్‌ (పంజాబ్‌)పై, విజయ్‌ (ఆంధ్రప్రదేశ్‌) 15-5, 15-10తో మోహిత్‌ …

Read More »