పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , August 14 2018
Breaking News
Home / Sports (page 3)

Sports

Sports

కోహ్లీ ఇన్నింగ్స్‌ అద్భుతం.. నాయకుడంటే అతడే సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసల జల్లు

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ మరోసారి పరుగుల యంత్రం అని రుజువు చేసుకున్నాడు. ఇంగ్లిష్‌ గడ్డపై తొలి శతకం సాధించి తన సత్తా చాటాడు. మరో వైపు ఆటగాళ్లు వికెట్లు కోల్పోతున్నా ఏమాత్రం ఒత్తిడికి గురవకుండా బాధ్యతనంతా భుజాలపై వేసుకుని జట్టును నడిపించాడు. పట్టుదలతో క్రీజులో పాతుకుపోయాడు. ఈ క్రమంలో శతకం పూర్తి చేశాడు.

Read More »

సింధు శుభారంభం ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంపై గురిపెట్టిన తెలుగమ్మాయి పి.వి. సింధు మెగా టోర్నీలో శుభారంభం చేసింది. తొలి అడ్డంకిని అలవోకగా దాటేసింది. మరోవైపు అబ్బాయిల్లో ఐదో సీడ్‌ శ్రీకాంత్‌ ప్రిక్వార్టర్‌ఫైనల్‌ చేరేందుకు కష్టపడగా.. సాయిప్రణీత్‌ సులభంగా ముందంజ వేశాడు. పదకొండో సీడ్‌ హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌కు నిరాశ తప్పలేదు. రెండో రౌండ్లో అతడు అనామకుడి చేతిలో పరాజయంపాలయ్యాడు. సమీర్‌ వర్మ కూడా నిష్క్రమించాడు.

Read More »

సెమీస్‌లో చోటే లక్ష్యం నేడు ఐర్లాండ్‌తో క్వార్టర్స్‌ మ్యాచ్‌ మహిళల హాకీ ప్రపంచకప్‌

చరిత్ర సృష్టించేందుకు భారత మహిళల హాకీ జట్టు ముందు మంచి అవకాశం. 44 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రపంచకప్‌ సెమీస్‌ చేరిన జట్టుగా నిలిచేందుకు భారత అమ్మాయిలకు కావాల్సింది ఒక విజయం. గురువారం క్వార్టర్స్‌లో ఐర్లాండ్‌తో భారత్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి సెమీస్‌ చేరడమే కాకుండా గ్రూప్‌ దశలో ఐర్లాండ్‌ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో భారత్‌ ఉంది. టోర్నీ ఆరంభంలో పెద్దగా ప్రభావం చూపని …

Read More »

అమ్మాయిలు భళా హాకీ ప్రపంచకప్‌ క్వార్టర్స్‌లో భారత్‌

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ అదరగొట్టింది. మంగళవారం జరిగిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో 3-0తో ఇటలీని చిత్తు చేసి క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఎక్కువ శాతం బంతిని నియంత్రణలో ఉంచుకున్న భారత్‌.. పదే పదే ఇటలీ గోల్‌పోస్టుపై ఎదురు దాడులు చేసింది. తొమ్మిదో నిమిషంలో లాల్‌రెమ్‌సియామి చేసిన గోల్‌ కొట్టి జట్టును ఆధిక్యంలో నిలిపింది. 45వ నిమిషంలో నేహా గోయల్‌ బంతిని నెట్‌లోకి పంపి ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. ఆరు …

Read More »

ఇంగ్లాండ్‌పై వెయ్యి పరుగులకు చేరువలో.. మరో అరుదైన ఘనతను అందుకోనున్న కోహ్లీ..

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ మరో అరుదైన రికార్డు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేంటంటే.. ఇంగ్లిష్‌ జట్టుపై వెయ్యికి పైగా పరుగులు సాధించడం. ఇప్పటి వరకు భారత్ తరఫున 12 మంది ఆటగాళ్లు మాత్రమే ఇంగ్లాండ్‌పై వెయ్యికి పైగా పరుగులు చేశారు. ఈ ఘనతను అందుకోవడానికి కోహ్లీ మరికొన్ని పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు ఇంగ్లాండ్‌ జట్టుపై 977 పరుగులు చేశాడు. భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య …

Read More »

ఎడ్జ్‌బాస్టన్‌లో కోహ్లీ సేన ప్రాక్టీస్‌

 ఆతిథ్య ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు కోహ్లీ సేన సిద్ధమవుతోంది. వర్షం కారణంగా ఆదివారం టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దయ్యింది. సోమవారం వరుణుడు ఎలాంటి ఆటంకం కలిగించకపోవడంతో కోహ్లీ సేన ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంది. ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ఆధ్వర్యంలో ఆటగాళ్లు బ్యాటింగ్‌, బౌలింగ్, ఫీల్డింగ్‌ విభాగాల్లో ప్రాక్టీస్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.

Read More »

అంతర్జాతీయ క్రికెట్లో సిక్సర్ల మోత మోగించారు టాప్‌-15లో ఐదుగురు మనోళ్లే

అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్ల(టెస్టు, వన్డే, టీ20)లో కలిపి అత్యధిక సిక్స్‌లు నమోదు చేసిన ఆటగాడు ఎవరు? అని అడిగితే వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌ గేల్‌ అని చెప్పేస్తాం. ఎందుకంటే గేల్‌ ఈ రికార్డును కొద్ది గంటల ముందే కదా సాధించింది. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో గేల్‌ 5 సిక్స్‌లు బాది అత్యధిక సిక్స్‌లు సాధించిన పాక్‌ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది (476) రికార్డును సమం …

Read More »

కోహ్లీ సేన ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దు

తొలి టెస్టు ప్రారంభానికి ముందు కోహ్లీ సేన ప్రాక్టీస్‌ రద్దయ్యింది. షెడ్యూల్‌లో భాగంగా ఆదివారం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొనాల్సి ఉంది. ఐతే, వర్షం కారణంగా మొత్తం ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దయ్యింది. చెమ్స్‌ఫోర్డ్‌లో మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ముగించుకుని కోహ్లీ సేన ఆదివారం బర్మింగ్‌హామ్‌ చేరుకుంది.భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ బుధవారం(ఆగస్టు 1న) నుంచి ప్రారంభంకానుంది. బర్మింగ్‌ హామ్‌ వేదికగా ఇరు జట్ల మధ్య …

Read More »

ఇంగ్లాండ్‌తో సిరీస్‌ అతడిపై విమర్శలు అనవసరం

కోహ్లీసేనతో జరిగే టెస్టు సిరీస్‌కు స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ను ఎంపిక చేయడంపై వస్తున్న విమర్శలు అనవసరమని ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు ఇయాన్‌ బోథమ్‌ అన్నారు. కొంత కాలంగా రషీద్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడకపోయినా టీమిండియాతో జరిగే తొలి టెస్టులో అతడిని ఎంపిక చేశారు. సెప్టెంబర్‌ నుంచి అతడు ఎరుపు బంతితో క్రికెట్‌ ఆడలేదు. అయినప్పటికీ అతడిని జట్టులోకి తీసుకోవడంతో మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లాండ్‌ మాజీ సారథి మైకేల్‌ …

Read More »

బౌలర్లు కష్టపడ్డారు ఎసెక్స్‌ 237/5 ఉమేశ్‌, ఇషాంత్‌లకు తలో రెండు వికెట్లు

ఇంగ్లాండ్‌ పర్యటనలో భాగంగా ఎసెక్స్‌తో జరుగుతున్న సన్నాహక మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతోంది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఎసెక్స్‌ కెప్టెన్‌ వెస్లీ (57; 89 బంతుల్లో 11×4), పెప్పర్‌ (68; 74 బంతుల్లో 15×4) అర్ధశతకాలతో సత్తాచాటడంతో బలమైన స్థితిలో నిలిచింది. అయితే తర్వాత పుంజుకున్న బౌలర్లు వికెట్లు పడగొట్టి భారత్‌ను తిరిగి పోటీలోకి వచ్చారు. ఆట ముగిసేసరికి ఎసెక్స్‌ 5 వికెట్లకు 237 పరుగులు చేసింది. ఆ …

Read More »