పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , August 14 2018
Breaking News
Home / Telangana

Telangana

Telangana

మల్కాపూర్‌ ముందుచూపు నేత్రదానానికి సిద్ధమైన 625 మంది గ్రామస్థులు

ముఖ్యమంత్రి తమ గ్రామానికి వస్తున్నారంటే.. చాలాచోట్ల వినతుల చిట్టాను రూపొందిస్తుంటారు. సమస్యల్ని ఏకరువు పెట్టి పక్కాగా హామీలు పొందాలన్న ప్రయత్నంలో ఉంటారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌ యువత మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించింది. రాష్ట్రం మొత్తానికి కంటి వెలుగులను ప్రసాదించే ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని తమ ఊరి నుంచే ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్‌కు వీరు అపురూప బహుమానం అందించేందుకు సిద్ధమయ్యారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 625 మందిని …

Read More »

శేరిలింగంపల్లి సభలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు తాము వస్తే ఏపీకి హోదా.. తెలంగాణకు హక్కులు కల్పిస్తామని హామీ

దేశంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్‌ ఇద్దరూ పరిపాలనలో, ప్రజల్ని మోసగించడంలో ఒకేరకంగా ముందుకెళుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, రాఫెల్‌ విమానాల కొనుగోలు నిర్ణయాలతో మోదీ పేదల జేబుల్లో పైసలు తీసుకుని పెద్దలకు దోచిపెట్టారని విమర్శించారు. రాఫెల్‌ కుంభకోణంపై ఏ వేదికపైనైనా మోదీతో చర్చకు సిద్ధమేనని ప్రకటించారు. నేనొక్కడినే ఒకవైపు.. మోదీ, ఆయన ప్రభుత్వం మరోవైపు అయినా ఫర్వాలేదని సవాల్‌ …

Read More »

జిల్లాకో సేంద్రియ ఉత్పత్తుల సూపర్‌ మార్కెట్‌ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

సేంద్రియ ఉత్పత్తుల విక్రయానికి జిల్లాకో సూపర్‌ మార్కెట్‌ను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర సేంద్రియ ధ్రువీకరణ అథారిటీ ద్వారా ‘సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ’ను సోమవారమిక్కడ ఆయన ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం రైతులు దీనికి హాజరై వారి అనుభవాలను తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. సేంద్రియ పంటల సాగుతోనే ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందన్నారు. సిక్కిం రాష్ట్రాన్ని …

Read More »

100 స్థానాల్లో గెలుపు ఖాయం ఆరునెలల గడువు వస్తే ముందస్తు ఎన్నికలుకావు తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు

తెలంగాణ‌ రాష్ట్రసమితి ఎన్నికల శంఖారావం పూరించింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధమని ప్రకటించింది. ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తులుండవని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేసింది. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని, 100 స్థానాల్లో విజయఢంకా మోగిస్తామని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీమా వ్యక్తంచేశారు. సోమవారం తన అధ్యక్షతన జరిగిన తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్‌ కీలక నిర్ణయాలను ప్రకటించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల …

Read More »

నేడూ రాష్ట్రంలో భారీ వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌ తీరం సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఒడిశా ఉత్తర తీర ప్రాంతంలో భూమిపై 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా కదులుతోంది. మంగళవారం నాటికి మరింత తీవ్రమయ్యే సూచనలున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజరావు తెలిపారు. ఆదివారం ఉదయం 8 …

Read More »

హైదరాబాద్‌ చేరుకున్న రాహుల్‌గాంధీ

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కొద్దిసేపటి క్రితం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్ణాటకలోని బీదర్‌కు బయలుదేరి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం శంషాబాద్‌ విమానాశ్రయానికి రానున్నారు. అక్కడి నుంచి శంషాబాద్‌లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్‌కు కాన్వాయ్‌గా రానున్నారు. క్లాసిక్ కన్వెన్షన్‌లో మహిళా స్వయం సహాయక బృందాలతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.

Read More »

వాగులో కొట్టుకుపోయి ఇద్దరి మృతి జయశంకర్‌ జిల్లాలో గోడకూలి మరొకరు మృతి

అతి భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దవుతున్నాయి. గత వందేళ్లకుపైబడి ఉన్న వాతావరణ రికార్డులన్నీ కొన్ని ప్రాంతాల్లో కొట్టుకుపోయేలా గత రెండురోజుల్లో అత్యధిక వర్షం కురిసింది. రామగుండం, ఆదిలాబాద్‌ జిల్లా చరిత్రల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో కురవడంతో కొత్త వర్షపాతం రికార్డులు నమోదయ్యాయి. మరోవైపు పెద్దపల్లి జిల్లాలో మూడేళ్ల చిన్నారి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఓ విద్యార్థి వాగులో కొట్టుకుపోయి మృతి చెందారు.కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన …

Read More »

ఆత్మగౌరవ పోరాట సభకు భారీగా హాజరైన కార్మికులు సంఘీభావం తెలిపిన వివిధ రాజకీయ పార్టీల నేతలు

తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల ఐకాస స్పష్టం చేసింది. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం నెలకు రూ.18వేలు చెల్లించాలని డిమాండ్‌ చేసింది. జీతాలను పంచాయతీ నుంచి కాకుండా నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని కోరింది. ప్రస్తుతం పనిచేస్తోన్న ఉద్యోగుల్లో పదోతరగతి అర్హతగల వారిని పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఐకాస …

Read More »

హైదరాబాద్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు రూ.5 కోట్లతో వసతి గృహం ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా

సీఎం కేసీఆర్‌ రజకులపై వరాల జల్లు కురిపించారు. ఈ వృత్తిలో ఉన్నవారికి 50 ఏళ్లు దాటినప్పటి నుంచే ఆసరా పింఛను ఇస్తామని ప్రకటించారు. రజక యువతకు ఉపాధి కల్పించేందుకు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రుణాలు ఇస్తామన్నారు. సమస్యల పరిష్కారంపై రజక సంఘం ప్రతినిధులతో శనివారం     ప్రగతిభవన్‌లో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేస్తున్న కులాల అభ్యున్నతికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని …

Read More »

చురుగ్గా నైరుతి రుతు పవనాలు ఉత్తర తెలంగాణలో రెండు రోజులుగా ముసురు పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

దాదాపు ఇరవై రోజుల తరవాత రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానల వల్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పైర్లు నీటమునిగాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం సాయంత్రం వరకూ వర్షం కురిసింది. ఉత్తర తెలంగాణలో రెండురోజులుగా ముసురు పట్టింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, గ్రామీణ, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, …

Read More »