పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , August 14 2018
Breaking News
Home / Telangana (page 116)

Telangana

Telangana

1,500 కొత్త బస్సులు

కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి తిప్పేందుకు అదనంగా 1,500 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. మంగళవారం సచివాలయంలో ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఎండీ రమణారావు తదితర ఉన్నతాధికారులతో సమీక్షించారు.సీఎం పలు సందర్భాల్లో ఆర్టీసీకి రూ.2 వేల కోట్లు ఇవ్వటంతో పరిస్థితి మెరుగైందన్నారు. ప్రస్తుతం 27 …

Read More »

విద్యార్థి ఆత్మహత్య

రాజధానిలోని ప్రగతినగర్‌ నారాయణ జూనియర్‌ కళాశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పంటకుదురుకు చెందిన వంశీధర్‌ కుమారుడు నాగసాయి.. ప్రగతినగర్‌ నారాయణ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం హాస్టల్‌లో నాగసాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీ సులు …

Read More »

ఏప్రిల్‌ 13 నుంచే వేసవి సెలవులు

రాష్ట్రంలో పాఠశాల విద్యా కేలండర్‌ జారీ అయింది. పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి జూన్‌ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించేలా కొత్తగా అకడమిక్‌ కేలండర్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేలండర్‌ ప్రకారం.. 2017–18 విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 12వ తేదీతో ముగుస్తుంది. ఏప్రిల్‌ …

Read More »

ఎల్‌ఆర్‌ఎస్‌తో ఎసరు..!

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) రక్షణలో ఉన్న ప్రభుత్వ భూములకే లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) కింద క్లియరెన్స్‌ ఇచ్చిన అంశం వివాదాస్పదమవుతోంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్‌ సర్వే నంబర్‌ 323లోని కోట్ల విలువ చేసే కొన్ని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ మంజూరు చేశారన్న అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2008లోనూ.. అలాగే 2015లోనూ దాదాపు 50 నుంచి 90 మంది తెల్లాపూర్‌ సర్వే నంబర్‌ 323లోని ప్లాట్లను క్రమబద్ధీకరించాలంటూ డాక్యుమెంట్లు …

Read More »

నేడు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఒరిస్సా నుంచి తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో నైరుతి రుతుపవనాలు మరింత ఊపందుకున్నాయి. దీంతో తెలంగాణలో మంగళవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. వచ్చే నెల ఒకటో తేదీ వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నా రు. అదే రోజు మళ్లీ రుతుపవనాలు ఊపందుకొని మరో 2 రోజులు వానలు కురుస్తాయన్నారు.

Read More »

డాక్టర్‌ ఏబీఎన్‌ రావు కన్నుమూత

సుప్రసిద్ధ ఈఎన్‌టీ వైద్య నిపుణుడు, కోఠీ ఈఎన్‌టీ వ్యవస్థాపక సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ అక్కినేపల్లి బద్రి నారాయణరావు(94) ఆస్ట్రేలియాలోని మెల్‌ బోర్న్‌లో సోమవారం కన్నుమూశారు. ఆయనకు భార్య నోరా, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మంగళవారం మెల్‌బోర్న్‌లోనే అంత్యక్రియ లు నిర్వహించనున్నట్లు ఆయన సోదరుడు యాదగిరిరావు తెలిపారు. ఏబీఎన్‌ రావు స్వస్థలం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు. డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి, డాక్టర్‌ రాజ్‌ బహదూర్‌గౌర్‌లతో కలసి చదువుకున్న ఆయన నిజాం …

Read More »

ఐదు కొత్త ఆస్పత్రులు

తల్లీ, బిడ్డల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో కొత్తగా ఐదు మాతా శిశుసంరక్షణ ఆస్పత్రులను నిర్మించనుంది. అచ్చంపేట, ఏటూరునాగారం, కామారెడ్డి, మంథని, సూర్యాపేటలో వీటిని నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన వైద్యశాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 50 పడకల సామర్థ్యంతో వీటిని నిర్మించనున్నారు. ఒక్కో ఆస్పత్రి నిర్మాణానికి రూ.7 కోట్ల చొప్పున మొత్తం రూ.35 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) …

Read More »

అమ్మా.. నే చదువుకుంటా!

ఆ తల్లి మనసు కరగలేదు. మాట విననందుకు… తన ఆదేశాలు ధిక్కరించినందుకు ఆ బాలికను చిత్రహింసలు పెట్టిందా మారు తల్లి. కర్రతో గొడ్డును బాదినట్టు బాది… చేతిపై వాతలు పెట్టి… ప్రత్యక్ష నరకం చూపింది. ఈ బాధలు తట్టుకోలేక బాలిక సోమవారం పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన నాగలక్ష్మి (15) మూడో తరగతి వరకు చదువుకుంది. తల్లిదండ్రులిద్దరూ …

Read More »

మద్యం షాపుల లీజు ఏడాదే

మద్యం దుకాణాల లైసెన్సు లీజు కాలాన్ని ఏడాదికే కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాత పాలసీలో రెండేళ్లుగా ఉన్న లీజు కాలాన్ని కొత్త ఎక్సైజ్‌ పాలసీలో ఏడాదికే పరిమితం చేయనుంది. అలాగే ఆరు శ్లాబులుగా ఉన్న లైసెన్సు ఫీజును ఈసారి మూడు శ్లాబులకు కుదించాలని, మొదటి రెండు శ్లాబుల పరిధిలోకి గ్రామీణ, పట్టణ ప్రాంత దుకాణాలను తీసుకొచ్చి లైసెన్సు ఫీజు పెంచాలని యోచిస్తోంది. దుకాణం లైసెన్సుతోపాటే పర్మిట్‌ రూం ఇవ్వాలని …

Read More »

రేపటి నుంచి ఉచిత చేప పిల్లల పంపిణీ

ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 30న ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులో చేప పిల్లలను బుధవారం విడుదల చేస్తామని తెలిపారు. ఈ ఏడాది 77 రిజర్వాయర్లు, 4,647 మత్స్యశాఖ చెరువులు, 20,391 గ్రామపంచాయతీ చెరువుల్లో మొత్తం 69.66 కోట్ల చేప పిల్లలను పంపిణీ …

Read More »