పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , May 22 2018
Breaking News
Home / Telangana (page 30)

Telangana

Telangana

ఆమ్లెట్‌ కోసం ఆత్మహత్య

ఆమ్లెట్‌ వేయాలని మొండికేసిన కుమారుడిని తల్లి మందలించడంతో క్షణికావేశంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామంలో శనివారం జరిగింది. బాల్నె పరుశరాములు, సరిత దంపతుల పెద్ద కుమారుడు బాల్నె అఖిల్‌ (21) జనగామ ఏకశిల కళాశాలలో ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం సాయంత్రం పనులకు వెళ్లి వచ్చిన తల్లిని ఆమ్లేట్‌ వేయాలని కోరగా ఆమె తిరస్కరించింది. అయినా మొండికేయడంతో తల్లి …

Read More »

అవసరం 206 టీఎంసీలు.. లభ్యత 163 టీఎంసీలు

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ మళ్లీ వేడి పుట్టిస్తోంది. సమయానికి జరగని త్రిసభ్య కమిటీ భేటీలు, నీటి వినియోగంలో వ్యత్యాసాలు, టెలీమెట్రీ వ్యవస్థ అమల్లో జాప్యం, అవసరాలకు సరిపడాలేని లభ్యత జలాలు వెరసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వివాదాలను పెద్దవి చేసేలా ఉన్నాయి. దీనికితోడు చాలా వివాదాస్పద అంశాల్లో పట్టనట్టుగా ఉన్న కృష్ణా బోర్డు వ్యవహారం రాష్ట్రాల మధ్య వివాదాన్ని పెంచుతున్నాయి. కృష్ణాబేసిన్‌లో ఉమ్మడి …

Read More »

సహనం కోల్పోయి చితకబాదుతున్న పోలీసులు

‘అడుసు తొక్కనేల.. కాలు కడుగనేల’.. అన్న సామెత పోలీస్‌ శాఖలోని కొంతమంది అధికారులకు సరిగ్గా సరిపోయేలా ఉంది. నేరాల నియంత్రణ, టెక్నాలజీ వినియోగంలో దేశంలోనే నంబర్‌ వన్‌ అనిపించుకున్న రాష్ట్ర పోలీస్‌ శాఖ.. ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకునేలా కనిపిస్తోంది. ఓ వైపు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటూ అధికారులు, సిబ్బందిని డీజీపీ మహేందర్‌రెడ్డి నడిపిస్తుంటే.. మరోవైపు బాధితులు, నిందితులతో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖను కుదిపేస్తోంది.   షార్ట్‌ ఫిలిం …

Read More »

128 ఏళ్లుగా ఒక్క క్షణం ఆగని చార్మినార్‌ గడియారం.. 1889 నుంచి ఇప్పటి వరకూ నిరంతరాయంగా పనిచేస్తున్న క్లాక్‌

చార్మినార్‌. హైదరాబాద్‌ మహానగరానికి మణిహారం. చార్మినార్‌ నిర్మాణంతోనే భాగ్యనగరానికి పునాదులు పడ్డాయి. తొలుత కుతుబ్‌షాహీ, అనంతరం అసఫ్‌జాహీ పాలకులు నగర ప్రజల కోసం అన్ని ఏర్పాట్లూ చేస్తూ వచ్చారు. ఆ కాలంలో భారతదేశంలో బ్రిటిష్‌ పాలకులు వారి అధీనంలో ఉన్న ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం ఎత్తైన టవర్లు నిర్మించి వాటిలో గడియారాలను అమర్చారు. గడియారం అంటే అంతగా ప్రాచుర్యం లేని రోజుల్లో ఈ క్లాక్‌ టవర్లు ప్రజలు సమయాన్ని తెలుసుకోవడానికి …

Read More »

తర్జనభర్జన పడుతున్న విద్యాశాఖ..

పాఠశాల విద్యా శాఖలో పర్యవేక్షణ అధికారి పోస్టుల్లో పదోన్నతుల గందరగోళం మొదలైంది. మండల విద్యాధికారి (ఎంఈవో), ఉప విద్యాధికారి (డిప్యూటీ ఈవో), డైట్‌ లెక్చరర్, బీఎడ్‌ కాలేజీ లెక్చరర్‌ వంటి పోస్టుల్లో పదోన్నతులను ఎవరికి కల్పించాలన్న విషయంలో విద్యా శాఖ తర్జన భర్జన పడుతోంది. ఎంఈవో మినహా మిగతా పోస్టులను తమకే ఇవ్వాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు మొదటి నుంచి డిమాండ్‌ చేస్తుండగా.. ఏకీకృత సర్వీసు రూల్స్‌కు రాష్ట్రపతి ఆమోదం లభించినందున, …

Read More »

నాలుగేళ్ల క్రితం యూనిఫాం నిలిపివేత

 తలపై టోపీ.. నేవీ బ్లూ రంగు యూనిఫాం.. క్రమశిక్షణ ఉట్టిపడే రూపం. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంకా ప్రధాన ఆకర్షణగా అట్టహాసంగా జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు సందర్భంగా ప్రతినిధులకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల సిబ్బంది వీరు. వీరిని చూస్తే ఆర్టీసీ సిబ్బంది దర్పం ఇలాగే ఉంటుందనుకుంటారు కదా! కానీ, వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. నాలుగేళ్లుగా ఆర్టీసీ కార్మికులకు యూనిఫామ్‌ అందటం లేదు. …

Read More »

ప్రవాసీ తెలంగాణ దివస్‌లో శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలచుకోవాల్సిన అవసరం ఉందని శాసన మండలి చైర్మన్‌ కె. స్వామిగౌడ్‌ అన్నారు. ఆదివారం రవీంద్రభారతి ప్రాంగణంలో తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం–యూఎస్‌ఏ ఆధ్వర్యంలో 5వ ప్రవాసీ తెలంగాణ దివస్‌ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన స్వామిగౌడ్‌ మాట్లాడుతూ.. ఎన్నో ఆత్మత్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్నిబంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవిరళ కృషి చేస్తోందన్నారు. నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో ఎక్కువగా ఉందని జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. …

Read More »

స్పై కెమెరాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం

స్పై కెమెరాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని సినీనటి సనా అన్నారు. మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న రహస్య కెమెరాలు విచ్చలవిడిగా అమ్మకుండా చూడాలని కోరారు. ఆన్‌లైన్‌లో స్పై కెమెరాలు కేవలం రూ.250కే దొరకటం విచారకరమన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో స్వచ్ఛంద సంస్థ హెవెన్‌ హోమ్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో ‘యాంటి రెడ్‌ ఐ’  పేరుతో చేపడుతున్న మిస్డ్‌కాల్‌ (8099259925) క్యాపెయినింగ్‌ బ్రోచర్‌ను సనా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సనా మాట్లాడుతూ.. …

Read More »

పామిడికి చేరుకొన్న నలుగురి మృతదేహాలు పోలీసు లాంఛనాలతో ఎస్సై, కానిస్టేబుల్‌కు అంత్యక్రియలు

తమిళనాడు రాష్ట్రం మధురై జిల్లా మరవన్‌కుళం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ రఘు, ధర్మవరం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆయన సోదరుడు రాంప్రసాద్‌, వీరి స్నేహితుడు మధుసూదన్‌రెడ్డి, డ్రైవర్‌ మహేష్‌ మృత్యువాతపడిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం తమిళనాడు నుంచి నలుగురి మృతదేహాలు పామిడికి చేరుకొన్నాయి. ఈ సందర్భంగా అన్నదమ్ముల మృతదేహాలను చూసిన తల్లి సుబ్బరత్నమ్మ, అక్క గౌరి, బంధువులు …

Read More »

గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ చాలా ప్రత్యేకం.

తెలుగునాట చాలామంది గవర్నర్లు వచ్చారు.. వెళ్లారు. వీరిలో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ చాలా ప్రత్యేకం. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు గవర్నర్‌గా వచ్చిన నరసింహన్‌.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకూ సేవలు అందిస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వం మారినా.. తెలుగుగడ్డపై పరిస్థితులు మారినా.. నరసింహన్‌ మాత్రం ఇక్కడివాడయ్యారు. అందుకు కారణం ఆయనలోని తెలుగుదనమే. కేంద్ర నిఘా విభాగం డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించిన నరసింహన్‌ గురించి గవర్నర్‌గా ఇక్కడికి వచ్చాక …

Read More »