పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , August 14 2018
Breaking News
Home / Telangana (page 4)

Telangana

Telangana

క్షణక్షణం.. భయంభయం!

పునాది సహా గోడ పూర్తిగా శిథిలమై ఎప్పుడు కూలుతుందో తెలియని ఈ పురాతన భవనం అచ్చంగా ఓ సర్కారు పాఠశాలది. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. 113 మంది విద్యార్థులు ఇందులో చదువుకుంటున్నారు. నిజాం కాలంలో నిర్మించిన ఈ భవనంలోనే నేటికీ తరగతులు నిర్వహిస్తుండటంతో.. క్షణంక్షణం బిక్కుబిక్కుమంటూ చదువులు కొనసాగిస్తున్నారు. పురాతన భవనం స్థానంలో కొత్తది నిర్మించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు …

Read More »

విద్యార్థి కాదు.. పంచాయతీ ప్రత్యేక అధికారి

కుప్పలకొద్దీ పుస్తకాలు ముందు వేసుకుని చదువుతున్న ఇతను.. ఏదో ప్రవేశ పరీక్ష కోసమో.., ఉద్యోగ నియామక పరీక్ష కోసమో చదువుతున్న విద్యార్థి కాదు. రంగారెడ్డి జిల్లాలోని ఓ పంచాయతీకి నియమితుడైన ప్రత్యేక అధికారి. పంచాయతీల్లో సర్పంచుల పాలన ముగియడంతో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో నూతనంగా ఏర్పడిన మక్తగూడ పంచాయతీ మణికంఠ(21) అనే ఇతను ప్రత్యేక అధికారిగా నియమితుయ్యాడు. ఇతను వ్యవసాయశాఖలో …

Read More »

దిల్లీ బయల్దేరిన కేసీఆర్‌‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఉదయం దిల్లీ బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన దిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జోనల్‌ విధానానికి ఆమోదం పొందడం పర్యటన ప్రధాన ఉద్దేశం. గిరిజనులు, ముస్లింల రిజర్వేషన్ల పెంపు, ఉమ్మడి హైకోర్టు విభజన సహా కేంద్రం ఇచ్చిన ఇతర …

Read More »

న్యూసెంచరీ పాఠశాలపై విద్యార్థి సంఘాల నేతల దాడి

ఇద్దరు విద్యార్థుల మృతికి కారణమైన కూకట్‌పల్లిలోని న్యూ సెంచరీ పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతల ఆందోళన కొనసాగుతోంది. పాఠశాల ఫర్నిచర్‌ను, బస్సు అద్దాలను విద్యార్థి సంఘాల నాయకులు ధ్వంసం చేశారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పాఠశాల బస్సును విద్యార్థి సంఘాల నేతలు ఎత్తిపడేశారు.

Read More »

రాష్ట్రమంతటా ఇక చిన్న పంచాయతీలే అన్నింటికీ ప్రత్యేక అధికారుల నియామకం

రాష్ట్రంలో పల్లెవాసులకు స్థానిక పాలన మరింత చేరువ కానుంది. ఒకేసారి 4,378 కొత్త పంచాయతీలు గురువారం అవిర్భవించనున్నాయి. కొత్తవాటితో కలిపి తెలంగాణలో పంచాయతీల సంఖ్య 12,751కి చేరుతుండగా.. వాటిలో 95 శాతం మేర చిన్న పంచాయతీలుగానే ఉంటాయి. ఫలితంతో స్థానికుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలక వర్గాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు వీలవుతుందనేది పంచాయతీరాజ్‌ శాఖ భావన. పంచాయతీల వారీగా నియమితులైన ప్రత్యేక అధికారులు గురువారం బాధ్యతలు  చేపడతారు. సర్పంచి, వార్డు …

Read More »

హరితహారంలో సీఎం కేసీఆర్‌ ప్రకటన ఒకేరోజు 1.25 లక్షల మొక్కలు నాటిన గజ్వేల్‌ ప్రజలు

మొక్కలు పెంచే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. అందరూ కలిసికట్టుగా కృషి చేసి పచ్చదనం పెంపొందించాలని పిలుపునిచ్చారు. అడవుల్లో పచ్చదనాన్ని పరిరక్షించేందుకు హరిత సైన్యాన్ని (గ్రీన్‌ బ్రిగేడ్స్‌) ఏర్పాటు చేయాలని, ఇందుకోసం పోలీసుల సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అడవుల్లో పచ్చదనం పరిరక్షణకు సిబ్బందిని, అవసరమైన నిధులూ కేటాయిస్తామని ప్రకటించారు. నాలుగో విడత హరితహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వేల్‌లో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. గజ్వేల్‌లో …

Read More »

ఎన్ని అడ్డంకులున్నా గడువులోగా ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ నుంచి శాశ్వతంగా దూరమవుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో, తమకు పుట్టగతులుండవనే భయంతో కుట్రలకు పాల్పడుతోందని, ఇప్పుడు రౌండ్‌టేబుల్‌ సమావేశాల పేరుతో కొత్త నాటకానికి తెరతీసిందని ధ్వజమెత్తారు. మంగళవారం తెరాస శాసనసభాపక్ష సమావేశంలో ఆయన ప్రభుత్వ విప్‌లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, మిషన్‌ భగీరథ ఉపాధ్యక్షుడు ప్రశాంతరెడ్డి,  ఆర్మూర్‌ ఎమ్మెల్యే …

Read More »

త్వరగా ఎదగడానికి హార్మోన్‌ ఇంజక్షన్ల ప్రయోగం: సీపీ నిందితుల అరెస్టు.. రిమాండ్‌

దూరప్రాంతాల నుంచి బాలికలను ఆశపెట్టి తరలించడం, వారితో వెట్టిచాకిరి చేయించడం, త్వరగా ఎదిగేందుకు ఇంజక్షన్లు ఇప్పించడం, చివరకు వ్యభిచారంలోకి దించడం.. ఇది యాదగిరిగుట్ట కేంద్రంగా వ్యభిచార గృహాల్లో బాలికలపై జరుగుతున్న దారుణం. ఏళ్లుగా సాగుతున్న ఈ దుర్మార్గపు క్రీడను రాచకొండ పోలీసులు అడ్డుకుని నిందితులను అరెస్టు చేశారు. మంగళవారం యాదగిరిగుట్ట ఠాణాలో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, డీసీపీ రాంచంద్రారెడ్డి, ఏసీపీ శ్రీనివాసాచార్యులతో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. …

Read More »

జాతీయ సగటును మించిన తలసరి వినియోగం అభివృద్ధికి ఇది సూచిక: మంత్రి జగదీశ్‌రెడ్డి

రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా మంగళవారం ఉదయం విద్యుత్‌ డిమాండ్‌ 10,429 మెగావాట్లకు చేరిందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు, దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డిలతో కలసి మంగళవారం విద్యుత్‌ సౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014 జనవరి 23న రోజూవారీ విద్యుత్‌ డిమాండు 6,660 మెగావాట్లుండగా.. మంగళవారం రికార్డు స్థాయిలో 10,429 మెగావాట్లకు చేరిందన్నారు. ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్‌)లో ఇది …

Read More »

జీనోమ్‌ వ్యాలీలో స్థాపన 40,000 చదరపు అడుగుల్లో ప్రయోగశాలలు, ఇంక్యుబేటర్‌ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సమీక్షలో మంత్రి కేటీఆర్‌ వెల్లడి

ఐటీ, తయారీ రంగాల్లో అంకుర పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు ప్రారంభించిన టీహబ్‌ మాదిరిగానే తెలంగాణలో బయోటెక్‌ హబ్‌ (బి-హబ్‌)ను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా ఏర్పాటుచేస్తున్న బీహబ్‌ ఔషధ, బయోటెక్‌, జీవశాస్త్రాల రంగాల్లోని అంకురాలు, పరిశోధనలకు, ఉత్పత్తులకు చేయూతనివ్వనుంది. జినోమ్‌ వ్యాలీలో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 60 కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీనిని స్థాపించనున్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో పరిశోధన, ప్రయోగశాలలు, ఇంక్యుబేటర్‌ అందుబాటులోకి …

Read More »