పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , January 23 2019
Breaking News
Home / Telangana (page 5)

Telangana

Telangana

నాచారం నుంచి విదేశాలకు సైతం ఎగుమతులు

నగరంలో సంక్రాంతి సందడి మొదలైంది. అందమైన రంగవల్లులతో లోగిళ్లు  హరిల్లులను తలపిస్తున్నాయి. రకరకాల పిండివంటలతో ఘుమఘుమలాడుతున్నాయి. నగరంలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఇళ్లల్లో  పిండివంటలు చేసుకోలేని వాళ్లు స్వగృహ ఫుడ్స్‌ వద్ద బారులు తీరుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక వైభవాన్ని తలపించేలా ప్రజల అభిరుచులకు అనుగుణమైన పిండివంటలతో స్వగృహ ఫుడ్స్‌ స్టాళ్లు  నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. ఇళ్లల్లో పిండివంటలు చేసుకొనేందుకు సమయం లేని వారికి ఈ స్టాళ్లు ఫుడ్‌ ప్రదాయినిగా మారాయి. …

Read More »

లీటర్‌కు రూ.5 నుంచి రూ.10 పెంపు

సంక్రాంతి పండగ ఎఫెక్ట్‌ రైళ్లు, బస్సులనే కాదు.. వంట నూనెనూ తాకింది. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైలు, బస్సుల టికెట్‌ ధరలు పెంచినట్టే ప్రయాణికు వంట నూనె ధరలు సైతం అమాంతం పెరిగాయి. నగరంలో రోజుకు వందల టన్నులకు పైగా వంట నూనె అమ్మకాలు జరుగుతున్నాయి. హోటల్స్, క్లబ్బులు, బార్లలో వంటలకు అత్యధికంగా వివిధ రకాల నూనెలు వినియోగిన్నారు. ఇక ఇళ్లలో కూడా నూనె వినియోగం పెరిగింది.

Read More »

వంద ఫీడర్ల పరిధిలో నిలిచిన సరఫరా..

చైనా మాంజా కేవలం పావురాలు, ఇతర పక్షులనే కాదు…విద్యుత్‌ వైర్లను సైతం వదలడం లేదు. పతంగులు విద్యుత్‌ వైర్ల మధ్య చిక్కుకోవడంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రేటర్‌ పరిధిలో ఆదివారం ఒక్క రోజే వంద పీడర్ల పరిధిలో ఇదే కారణంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కందికల్‌గేట్‌ సమీపంలోని విద్యుత్‌ వైర్లకు ఆదివారం ఉదయం చైనామాంజా చిక్కుకుని, షార్ట్‌సర్క్యూట్‌ తలెత్తడంతో ఆయా ఫీడర్ల పరిధిలోని కాలనీల్లో దాదాపు గంటన్నర …

Read More »

ఎల్బీనగర్‌ చౌరస్తాకు సంక్రాంతి కళ తెల్లవారుజాము నుంచే ప్రయాణికుల సందడి

సొంత ఊరిలో సంక్రాంతి పండగ జరుపుకొనేందుకు నగరవాసులు కదిలారు. విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవులు ప్రకటించగా కార్యాలయాల్లో పనిచేసే వారికి రెండో శనివారం కలిసి వచ్చింది. శనివారం ఉదయం ఈ ప్రాంతంలో పొగమంచు విపరీతంగా కురిసినప్పటికీ ప్రయాణికులు మంచును కూడ లెక్క చేయక ఊళ్లకు పయనమయ్యారు. శుక్రవారం సాయంత్రం నుంచే ఈ ప్రాంతమంతా రద్ద్దీ ఏర్పడింది. ఎల్బీనగర్‌, చింతలకుంట, పనామా పలు చౌరస్తాలు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఎల్బీనగర్‌, చింతలకుంట చౌరస్తాలవద్ద తెలంగాణ …

Read More »

ఎందులో ప్రయాణించినా బాదుడే పండగ వేళ.. బడ్జెట్‌ తారుమారు కొండెక్కి కూర్చొన్న ఛార్జీలు

తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతి.ఇది ఆత్మీయానుబంధాలను పెంచుతుంది. బతుకుతెరువు, ఉపాధి రీత్యా స్వస్థలాలను విడిచిపెట్టి భాగ్యనగరానికి కుటుంబాలతో చేరుకున్నవారు ‘పల్లె పిలుస్తోంది’ అంటూ ప్రయాణాలు పెట్టుకునేది ఇప్పుడే. పైసా పైసా కూడబెట్టి అయినవారితో కలిసి సంక్రాంతిని జరుపుకొందామని కొన్ని నెలలుగా కలలు గంటున్నవారికి ప్రస్తుతం ప్రయాణమే కలవరపెడుతోంది. దేనిలో వెళదామన్నా ఛార్జీలు దడ పుట్టిస్తున్నాయి. నగరం నుంచి ఊరెళ్లేందుకు రైల్వే టిక్కెట్లు 4 నెలల ముందే అందుబాటులోకి రావడం, క్షణాల్లో …

Read More »

టోల్‌ రద్దు చేసినా వసూలు చేస్తున్న సిబ్బంది

సంక్రాంతి పండగ సందర్భంగా జాతీయ రాహదారులపై టోల్‌గేట్ల వద్ద రుసుములు రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ టోల్‌గేట్‌ సిబ్బంది టోల్‌ వసూలు చేస్తున్నారు. పండుగకు ప్రజల ప్రయాణాల దృష్ట్యా… 13, 16 తేదీల్లో జాతీయ రహదారులపై టోల్‌గేట్ల వద్ద రుసుముల వసూళ్లను రద్దుచేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు, జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే ఈ ఆదేశాలను …

Read More »

ఆన్‌లైన్‌లో ఆంధ్ర బస్సులకేప్రాధాన్యమిస్తున్న ప్రయాణికులు

సంక్రాంతి రద్దీ మొదలైంది. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇవ్వడంతో శుక్రవారం నుంచి ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లేందుకు పోటెత్తారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ వాసుల్లో అధికశాతం ఊళ్లు 200 కిలోమీటర్లలోపే కాబట్టి వీరంతా నేరుగా బస్టాండ్లకే వచ్చి ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌ బస్సుల్లో ఎక్కుతున్నారు. దూరంగా ఉన్న ప్రాంతాలకు రాజధాని, సూపర్‌ లగ్జరీ, వజ్ర, గరుడ బస్సుల్లో రిజర్వేషన్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. …

Read More »

ఇప్పటికే రూ.12 లక్షలు ఖర్చు చేసిన కుటుంబం

సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా పెద్ద కుదుపు. పిల్లలను మంచిగా చదివించాలని పట్టుదలతో శ్రమిస్తున్న ఆ తల్లిదండ్రులకు తీరని కష్టం. ఉద్యోగం కోల్పోయినా కుల వృత్తి చేసుకుంటూ అతడు, కూలీ పనికి వెళ్తూ ఆమె కుటుంబాన్ని పోషిస్తున్నారు. కష్టపడి పిల్లలను చదివిస్తున్నారు. తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా కొడుకు సరస్వతీ పుత్రుడు. చదువులో రాణిస్తూ పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ సరస్వతీ పుత్రుడికి విధి ‘రక్త’ పరీక్ష పెట్టింది.

Read More »

తెలియకుండా బానిసలవుతున్న వైనం

చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటేచాలు.. సమస్త ప్రపంచం గుప్పిట్లో ఉన్నట్టే. ఆధునిక కాలంలో ఏది కావాలన్నా ఫోన్‌లోనే సెర్చ్‌ చేస్తున్నాం. ఒకప్పుడుసమాచార మార్పిడి అవసరాల కోసం మనం తెచ్చుకున్న టెక్నాలజీ.. ప్రస్తుతం అది లేకుండే ప్రపంచమే కాదు.. జీవితమే లేదన్నట్టు ప్రజలను తనకు బానిసలుగా మార్చేసుకుంది. అంటే మానవ అవసరాలను దాటిపోయి సెల్‌ఫోన్‌ను వదులుకోలేని పరిస్థితికితీసుకొచ్చేసింది. దీనివల్ల ఇప్పటి కాలంలో మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతోందని చెప్పాలి. ముఖ్యంగా …

Read More »

గాలిస్తున్న అటవీ శాఖ, వైల్డ్‌లెన్స్‌ బృందాలు

నగర శివారులో కనిపించిన చిరుత గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) క్యాంపస్‌లోకి వచ్చిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం మధ్యాహ్నం 1:30గంటలకు ఎల్‌హెచ్‌–6 ప్రాంతంలో చిరుత కుక్కను వెంబడించగా తాను చూశానని హెచ్‌సీయూ సెక్యూరిటీ గార్డు పేర్కొనడంతో అందరూ అప్రమత్తమయ్యారు. అటవీశాఖ అధికారులు, వైల్డ్‌లెన్స్‌ బృందం, సెక్యూరిటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది.

Read More »