పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , November 20 2018
Breaking News

ఏం చేశారని కేసీఆర్‌కు ఓటేయాలి? ఆయన హయాంలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయి తెజస అధినేత కోదండరామ్‌ ధ్వజం

నాలుగున్నరేళ్ల కేసీఆర్‌ పాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ధ్వజమెత్తారు. ఏం చూసి కేసీఆర్‌కు ప్రజలు ఓటేయాలని ప్రశ్నించారు. తెరాసది నిరంకుశ పాలన అయితే.. తమది ప్రజల ఆకాంక్ష పాలన అని, ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ మేరకు బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.ఐకాసతో పోల్చితే తెలంగాణ జనసమితి ఏర్పాటు చేయడం కష్టంగా అనిపించలేదని కోదండరామ్‌ అన్నారు. తెజస పెట్టిన …

Read More »

బిన్‌ లాడెన్‌ గురించి తెలిసినా చెప్పలేదు‌ బిలియన్ల డాలర్లు ఇస్తే తిరిగి పాక్‌ ఏం చేసింది? : ట్రంప్‌

పాకిస్థాన్‌కు సైనిక సహాయం నిలిపేయాలని తాను తీసుకున్న నిర్ణయం సరైనదే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పష్టం చేశారు. తమ నుంచి బిలియన్ల డాలర్ల డబ్బు సహాయంగా తీసుకుని తిరిగి తమకు పాకిస్థాన్‌ ఏం చేయలేదని, కనీసం చిన్న సహయం కూడా చేసిపెట్టలేదని ట్రంప్‌ పేర్కొన్నారు. ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రంప్‌ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. పాక్‌కు దాదాపు 2బిలియన్‌ డాలర్ల సైనిక సహాయాన్ని …

Read More »

చైనా సరిహద్దుల్లో భారీ నిర్మాణాలు 19 వ్యూహాత్మక రోడ్లు, 29 భవనాలు నిర్మించాలని కేంద్రం నిర్ణయం

చైనా సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల్లోని భారత్‌-చైనా సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మక రహదారులు, శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సాధికారక కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దుల్లో రూ. 25వేల కోట్లతో చేపట్టే కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల భాగంగా వీటిని నిర్మించనున్నారు. …

Read More »

శబరిమలలో అర్ధరాత్రి ఉద్రిక్తత

కేరళలోని శబరిమలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయ ప్రాంగణంలో పోలీసుల ఆంక్షలను వ్యతిరేకిస్తూ ఆదివారం అర్ధరాత్రి సమయంలో భక్తులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న భాజపా, ఆరెస్సెస్‌ కార్యకర్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నివాసం సహా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కూడా నిరసనకు దిగారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు …

Read More »

మరో రెండడుగులే.. దూసుకెళ్లండి ట్విటర్‌లో టీమిండియాపై ప్రశంసలు

మహిళల టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన అదరగొడుతోంది. తొలి మూడు మ్యాచ్‌లలో హ్యాట్రిక్‌ విజయాలతో సత్తా చాటిన భారత మహిళా క్రికెటర్లు.. నాకౌట్‌ ముంగిట పటిష్ట ఆస్ట్రేలియాతో జరిగిన పోరులోనూ అదే జోరు కొనసాగించారు. బ్యాటింగ్‌లో మంధాన(83; 55 బంతుల్లో 9×4, 3×6) ధనాధన్‌ మెరుపులు.. బౌలింగ్‌లో అనూజ (3/15), పూనమ్‌ యాదవ్‌ (2/28), రాధ యాదవ్‌ (2/10), దీప్తి శర్మ (2/24) ఆసీస్‌ బ్యాట్స్‌వుమెన్‌ను ఓ ఆట ఆడుకోవడంతో …

Read More »

ఆసీస్‌పై ఈ విజయం చాలా ప్రత్యేకం భారత ఓపెనర్‌ స్మృతి మంధాన

మహిళల టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలతో ఊపుమీదున్న భారత్‌.. శనివారం పటిష్ట ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. ఓపెనర్ స్మృతి మంధాన(83; 55బంతుల్లో 9×4, 3×6) ఆరంభం నుంచి ఆసీస్‌ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ స్కోరుబోర్డును ముందుండి నడిపించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(43; 27బంతుల్లో 3×4, 3×6) కూడా మెరిపించడంతో 48పరుగుల భారీ తేడాతో భారత్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నట్లయింది. …

Read More »

ముంబయి చేరుకున్న ‘దీప్‌వీర్‌’

బాలీవుడ్‌ నూతన జంట దీపిక పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ ఈరోజు ఉదయం ముంబయి చేరుకున్నారు. ఇటీవల ఇటలీలో వివాహ బంధంతో ఒక్కటైన దీపిక, రణ్‌వీర్‌కు ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం దక్కింది. ఫొటోగ్రాఫర్లు వారిద్దరి ఫొటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ సవ్యసాచి డిజైన్‌ చేసిన సల్వార్‌ కమీజ్‌, షేర్వాణీలు ధరించారు‌. తన ప్రియమైన సతీమణిని రణ్‌వీర్ తన ఇంటికి తీసుకెళ్లి గృహప్రవేశం చేయించినట్లు తెలుస్తోంది.

Read More »

నేత్రదానం చేస్తా: కీర్తి సురేష్‌

భవిష్యత్తులో నేత్రదానం చేస్తానని ‘మహానటి’ ఫేం నటి కీర్తి సురేశ్‌ పేర్కొన్నారు. వేలచ్చేరిలో కొత్తగా నిర్మితమైన డాక్టర్‌ అగర్వాల్‌ నేత్ర వైద్యశాల శాఖను ఆమె శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ మరణం తర్వాత మనం చేసే ఓ గొప్ప విషయం నేత్రదానమేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు నేత్రదానం చేయాలని కోరారు. నేత్రదానం ఆవశ్యకతపై ఆస్పత్రి ఛైర్మన్‌ అమర్‌ అగర్వాల్‌ ప్రసంగించారు. తాము వంద మందికి ఉచిత శస్త్ర …

Read More »

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం సీఎం కేసీఆర్‌దే ఈ ఘనత మంత్రి కేటీఆర్‌ వెల్లడి

తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు దేశానికే మార్గదర్శకమని, అన్ని రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కొత్త రాష్ట్రమైనా కృషి, పట్టుదల, సంకల్ప దీక్షతో  ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ కారణంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్టుబడులకు అనుకూలతలు తెలంగాణలో ఏర్పడ్డాయని చెప్పారు. ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక ప్రకటించిన ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరఫున కేటీఆర్‌ శనివారం …

Read More »

ప్రజాకూటమి ఛైర్మన్‌గా కోదండరాం ఉమ్మడి ప్రచారంలోనూ కీలక పాత్ర

ప్రజాకూటమికి ఛైర్మన్‌గా ఆచార్య కోదండరాం వ్యవహరిస్తారు. ఎన్నికల్లో భాగస్వామ్య పార్టీలతో కలిసి నిర్వహించనున్న ఉమ్మడి ప్రచారంలోనూ తెజస అధినేత కీలక పాత్ర పోషించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జనగామ స్థానంలో పోటీకి కోదండరాం సిద్ధపడగా.. కాంగ్రెస్‌ అధిష్ఠానం కూడా తొలుత అంగీకరించింది. తర్వాత జరిగిన పరిణామాల్లో పొన్నాల లక్ష్మయ్యకే సీటును కేటాయించేలా తెజస అధినేతను కాంగ్రెస్‌ నేతలు ఒప్పించారు.

Read More »