పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Wednesday , July 18 2018
Breaking News

ఎంత ఎత్తుకెదిగినా మాతృభాషను మరవొద్దు దిల్లీ ఆంధ్ర విద్యా సంఘం వ్యవస్థాపక దినోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు

‘మనుషుల్ని ఒక సమాజంగా నిలబెట్టేది భాషే. మనం ఎక్కడికి వెళ్లినా భాష, యాస, కట్టు, బొట్టులను కాపాడుకున్నప్పుడే మన మూలాలకు సమాధానం దొరుకుతుంది’’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన దిల్లీలోని ఆంధ్ర విద్యాసంఘం వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. 70 ఏళ్ల క్రితం దిల్లీలోని తెలుగువారికోసం దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ ప్రారంభించిన ఆంధ్ర విద్యాసంఘం ఇంతింతై అన్నట్లు ఎదిగి ఎంతోమందికి …

Read More »

వంశధార నదిలో చిక్కుకున్న వారంతా సురక్షితం 53 మందిని ఒడ్డుకు చేర్చిన సహాయబృందాలు

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం సమీపంలో వంశధార నదిలో చిక్కుకుపోయిన 53 మందిని సహాయ బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. వంశధార నదీ గర్భంలో ఇసుకను తోడేందుకు వెళ్లిన కూలీలు, డ్రైవర్లు వరద కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. ఒక్కసారిగా వంశధార నదిలో వరద ప్రవాహం అధికం కావడంతో వీరంతా చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు సహాయచర్యలు ముమ్మరం చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది చాలా సమయం …

Read More »

విఫలమైన బ్యాట్స్‌మెన్‌ రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌ ఓటమి రూట్‌ శతకం

బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో రెండో వన్డేలో భారత్‌ భంగపడింది. రూట్‌ (113; 116 బంతుల్లో 8×4, 1×6) సెంచరీ బాదడంతో శనివారం ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 86 పరుగుల తేడాతో గెలిచింది. రూట్‌ శతకానికి మోర్గాన్‌ (53; 51 బంతుల్లో 4×4, 1×6), విల్లీ (50 నాటౌట్‌; 31 బంతుల్లో 5×4, 1×6) మెరుపులు తోడవడంతో మొదట ఇంగ్లాండ్‌ 7 వికెట్లకు 322 పరుగులు సాధించింది. లక్ష్యఛేదనలో తడబడిన భారత్‌ …

Read More »

మొన్న సంక్రాంతి..నిన్న శతమానం భవతి నేడు ‘చినబాబు’

ప్రముఖ కథానాయకుడు కార్తి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చినబాబు’. పాండిరాజ్‌ దర్శకత్వం వహించారు. గురువారం విడుదలైన ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో తెరకెక్కించిన కథ ఇది. రైతు కష్టాలను సున్నితంగా చర్చిస్తూనే ఒక ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాలు, అలకలు, కోపాల్ని తెరపై చక్కగా చూపించారు దర్శకుడు.

Read More »

రుచికి, శుచికి ప్రాధాన్యం… పద్ధతిగా వడ్డన అంచనాకు మించి వస్తున్న జనం అక్కడక్కడ నిర్వహణ లోపాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘అన్న క్యాంటీన్ల’కు విశేష ఆదరణ లభిస్తోంది. ఉదయం అల్పాహారమైన, మధ్యాహ్నం లేదా రాత్రి భోజనమైనా రూ.5కే అందిస్తుండటంతో ప్రధానంగా కూలీలు, పేదలు, భవన నిర్మాణ కార్మికులు, యాచకులు, నిరాశ్రయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల దిగువ మధ్యతరగతి వారూ వచ్చి తింటున్నారు. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 60 చోట్ల వీటిని ప్రారంభించగా…అన్ని చోట్ల అంచనాకు మించి మరీ జనం …

Read More »

క్యాన్సర్‌ రోగులను పరామర్శించిన జగపతిబాబు

విలక్షణ నటుడు జగపతిబాబు ఆదివారం విజయవాడ నగరంలో పర్యటించారు. అశోక్‌నగర్‌లోని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ పదో వార్షికోత్సవం సందర్భంగా ఆయన సంస్థను సందర్శించారు. చివరి దశలో ఉన్న క్యాన్సర్ రోగులను ఆప్యాయంగా పలకరించిన జగపతిబాబు… రూట్స్ ఫౌండేషన్ వారు క్యాన్సర్ రోగులకు ఉచితంగా అందిస్తున్న సేవలు చూసి హర్షం వ్యక్తం చేసారు. ఎవరికీ వారే స్వార్థంతో బతుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా స్వచ్చందంగా సేవ చేయడం అభినందనీయమని ప్రశంసించారు. చివరి …

Read More »

శాస్త్రీయ విధానంలో విచారణ జరగాలి ప్రభుత్వోద్యోగులను వెంటనే అరెస్టు చేయొద్దు సీఎం కేసీఆర్‌ నిర్ణయం

ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో అవినీతి నిరోధక శాఖ (అనిశా) అనుసరిస్తున్న దాడులు, విచారణ విధానంలో సమూల మార్పులు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. నేరుగా లంచాలు తీసుకొని, అక్కడికక్కడే దొరికిన వారిని శిక్షించడం సబబే అని.. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు వచ్చే అభియోగాలు, ఫిర్యాదుల విషయంలో మాత్రం ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేవలం ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకోవడం కాకుండా శాస్త్రీయ కోణంలో …

Read More »

అడియాల జైలుకు షరీఫ్‌

అవినీతి కేసులో అరెస్టయిన పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌(68), ఆయన కుమార్తె మర్యం (44)లను పోలీసులు రావల్పిండిలోని అడియాల జైలుకు పంపించారు. అక్కడ వారికి ‘బి’ శ్రేణి సౌకర్యాలను కల్పించారు. ఇస్లామాబాద్‌లోని సిహాల పోలీసు శిక్షణ కళాశాలలోని అతిథి గృహాన్ని సబ్‌జైలుగా మార్చాలని తొలుత అనుకున్నా, ఆ ప్రతిపాదనను విరమించుకొని అడియాలకు పంపించారు. మరోవైపు అల్‌ అజీజా స్టీల్‌ మిల్స్‌, ఫ్లాగ్‌ షిప్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ అవినీతి కేసుల్లో విచారణ …

Read More »

ఆపత్కాల వైద్యంలో నూతన ఆవిష్కరణలు! దిల్లీలో దేశ, విదేశీ వైద్యుల చర్చ

ప్రమాదాలకు గురై ఆసుపత్రికి వచ్చే వారికి ఆపత్కాల వైద్య సేవలు అందించడంలో నూతన ఆవిష్కరణలపై దేశ, విదేశీ వైద్యులతో దేశరాజధానిలో కార్యశాల నిర్వహించారు. నాలుగు రోజులుగా రాక్లాండ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమర్జనీ మెడిసిన్‌ (దిల్లీ), యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌వేల్స్‌లు సంయుక్తంగా ఈ కార్యశాలను నిర్వహించాయి. ‘పరిశోధన, నాయకత్వం, నూతన ఆవిష్కరణ’ పై నిర్వహించిన ఈ కార్యశాలలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది, అమెరికా, ఇంగ్లండ్‌లకు చెందిన 15 …

Read More »

అమెరికాకు భారీ సైబర్‌ దాడి ముప్పు

అమెరికా జాతీయ భద్రతకు సైబర్‌ ముప్పు తీవ్రస్థాయిలో పొంచి ఉందని ఆ దేశ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించడానికి ఎన్నికల సమయంలోనే కాక రోజువారీగా కూడా డిజిటల్‌ మార్గంలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ‘నేషనల్‌ ఇంటెలిజెన్స్‌’ డైరెక్టర్‌ డాన్‌ కోట్స్‌ పేర్కొన్నారు. రష్యా నుంచే ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. చైనా, ఇరాన్‌, ఉత్తర కొరియాతోపాటు నేరముఠాలు, వ్యక్తిగత హ్యాకర్లు కూడా దుష్ట ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. అమెరికాలోని …

Read More »