పుట్టినరోజు శుభాకాంక్షలు ,మీ పెళ్లి రోజు శుభాకాంక్షలకు,మీ వ్యాపార అభివృద్ధికి ,మరణించిన వారికి శ్రధనంజలి ప్రకట్టనలకు సంప్రదించండి 9248011114.                          Happy Birthday Add Rs.500 FULL Day Call: 9248011114                          Scrolling Add Rs.500 Call: 9248011114                          Full day Add Rs. 1000 Call: 9248011114                          Sponser Logo Add Rs.800 Call: 9248011114                          Video Add Rs.1500 Call: 9248011114                          30 Minites Programes ADD Rs.2000 Call: 9248011114

Tuesday , November 20 2018
Breaking News

ఇండో పసిఫిక్‌ శాంతికి కట్టుబాటు తూర్పు ఆసియా శిఖరాగ్ర మావేశంలో మోదీ ఉద్ఘాటన ముగిసిన సింగపూర్‌ పర్యటన

ఇండో పసిఫిక్‌ ప్రాంతం శాంతియుతంగా, సమ్మిళితంగా, సుసంపన్నంగా ఉండేందుకు భారత్‌ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. సభ్య దేశాల మధ్య బహుళపాక్షిక సహకారం, ఆర్థిక-సాంస్కృతిక సంబంధాలు మరింతగా పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. గురువారం సింగపూర్‌లో జరిగిన 13వ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు (ఈఏఎస్‌)లో ఆయన ప్రసంగించారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) ఒప్పందానికి, నౌకాయాన సహకారానికి కూడా భారత్‌ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ఈ …

Read More »

వ్యవసాయ సమస్యలకు శాశ్వత పరిష్కారం రుణ మాఫీ, ఉచిత విద్యుత్‌ కేవలం ప్రజాకర్షక చర్యలే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు

వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అవసరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. రుణ మాఫీ, ఉచిత విద్యుత్‌ లాంటివి తాత్కాలిక, ప్రజాకర్షక చర్యలేనని ఆయన వ్యాఖ్యానించారు. మౌలిక సదుపాయాల కల్పన, తక్కువ రేటుకు రుణాలు, గిట్టుబాటు ధరలు లాంటివి వ్యవసాయ రంగ స్థితిగతులను మెరుగు పరచగలవని వివరించారు. ముంబయి యూనివర్సిటీలో ఆరెస్సెస్‌ నాయకుడు లక్ష్మణరావ్‌ ఇనామ్‌దార్‌ స్మారక కార్యక్రమాన్ని ఉద్దేశించి గురువారం ఆయన ప్రసంగించారు. మారుతున్న సాంకేతిక-ఆర్థిక పరిస్థితులు, …

Read More »

తలైవాస్‌ 32.. స్టీలర్స్‌ 32 ప్రొ కబడ్డీ

ప్రొ కబడ్డీ లీగ్‌లో బుధవారం తమిళ్‌ తలైవాస్‌, హరియాణా స్టీలర్స్‌ మధ్య చివరి నిమిషం దాకా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌ 32-32తో డ్రాగా ముగిసింది. ప్రథమార్ధంలో 19-15తో హరియాణా పైచేయి సాధించినప్పటికీ.. ద్వితీయార్ధంలో తలైవాస్‌ పుంజుకుంది. 27-27 వద్ద ఆ జట్టు స్కోరు సమం చేసింది. ఒక దశలో తలైవాస్‌ 31-29తో విజయానికి చేరువగా వెళ్లింది. ఐతే చివరి 3 నిమిషాల్లో స్టీలర్స్‌ చక్కటి ప్రదర్శనతో స్కోరు సమం …

Read More »

అసలు ఇంటికి వెళ్లాలనిపించలేదు చాలా బాధపడ్డాను: రమ్యకృష్ణ

‘పార్టీ సినిమా చిత్రీకరణ జరుగుతున్నన్ని రోజులు అసలు ఇంటికే వెళ్లాలనిపించలేదని అంటున్నారు ప్రముఖ నటి రమ్యకృష్ణ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘పార్టీ’. ఇందులో రమ్యకృష్ణ.. ప్రముఖ నటుడు సత్యరాజ్‌కు భార్యగా నటించారు. ఈ సందర్భంగా సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘చాలా కాలం తర్వాత నేను ఎదురుచూస్తున్న స్క్రిప్ట్‌ దొరికింది. చిత్రీకరణ జరిగినన్ని రోజులు మేం నవ్వుతూనే ఉన్నాం. సాధారణంగా మేం షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ఎప్పుడెప్పుడు …

Read More »

ఏపీలో అతి తక్కువ ద్రవ్యోల్బణం దేశంలో రెండో స్థానం వినియోగదారులకు ప్రయోజనం

ఆంధ్రప్రదేశ్‌లో ద్రవ్యోల్బణ శాతం మైనస్‌కు చేరింది. అక్టోబరులో దేశంలో సగటు ద్రవ్యోల్బణం 3.31% నమోదు కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో – 1.07% నమోదైంది. ఈ విషయంలో హిమాచల్‌ప్రదేశ్‌ – 0.73%తో ఏపీ కంటే ఒక మెట్టు పైన ఉంది. దేశంలో అత్యధికంగా అసోంలో 6.03% ద్రవ్యోల్బణం నమోదైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నమోదైన వినియోగ ధరల ఆధారంగా కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తుంది. రోజువారీ ఉపయోగించే వినియోగ …

Read More »

ఊహకందని కొత్త ప్రపంచం..‘ఆక్వామన్‌’ ‘బిహైండ్‌ ది సీన్స్‌’ వీడియో విడుదల

‘ఆక్వామన్‌’ చిత్రం కోసం ఊహకందని ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టంచామని అంటున్నారు చిత్ర దర్శకుడు జేమ్స్‌ వాన్‌. జేసన్‌ మొమోవా ఇందులో ఆక్వామన్‌ పాత్రలో నటించారు. ఆంబర్‌ హర్డ్‌, పాట్రిక్‌ విల్సన్‌, నికోల్‌ కిడ్మన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా ‘బిహైండ్‌ ది సీన్స్‌’ పేరిట చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది. వీడియోలో ఆక్వామన్‌ పాత్రను ఎలా రూపొందించారో చూపించారు. ఈ సినిమా కోసం ఓ ప్రపంచాన్నే …

Read More »

ఈ రోజు సచిన్‌కు స్పెషల్‌..! మాస్టర్‌బ్లాస్టర్‌‌ తొలిసారి మైదానంలోకి అడుగుపెట్టి నేటితో 29ఏళ్లు

భారత క్రికెట్‌ చరిత్రలో ఈ రోజుకో ప్రత్యేకత ఉంది. సరిగ్గా 29ఏళ్ల క్రితం ఓ 16ఏళ్ల కుర్రాడు నూనుగు మీసాలతో బ్యాట్‌ చేత బట్టి మైదానంలోకి అడుగుపెట్టిన రోజు ఇది. ఆ మ్యాచ్‌లో అతను సాధించింది 15పరుగులే అయినా.. ఇమ్రాన్‌ ఖాన్‌, వసీం అక్రమ్‌, వకార్‌ యూనిస్‌ వంటి భీకర ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కొన్న తీరు నిజంగా అద్భుతం. అప్పటి నుంచి వెనుతిరిగి చూడకుండా రికార్డులతో హోరెత్తించాడు. క్రీజులోకి రావడమే …

Read More »

వచ్చే ఏడాదిలో మళ్లీ ట్రంప్‌, కిమ్‌ భేటీ! ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించిన అమెరికా ఉపాధ్యక్షుడు

వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో ‌ మళ్లీ సమావేశం అయ్యేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రణాళికలు చేస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్‌ వెల్లడించారు. గత జూన్‌లో జరిగిన సింగపూర్‌ సదస్సుకు ఇది కొనసాగింపువంటిదని గురువారం తెలిపారు. ఉత్తరకొరియా అణ్వాయుధ తయారీ కార్యక్రమానికి చరమగీతం పాడడం సహా ఇతర అంశాల్లో పురోభివృద్ధి కోసం ఈ సమావేశం తోడ్పడుతుందని అన్నారు. అమెరికా గత పాలకులు ఉత్తర …

Read More »

అమరావతికి చేరిన టిక్కెట్ల పంచాయతీ సామ రంగారెడ్డిని కలవని చంద్రబాబు ఎల్‌.రమణకు వ్యతిరేకంగా ఆయన అనుచరుల ఆందోళన

తెలంగాణలో తెదేపా టిక్కెట్ల పంచాయతీ అమరావతికి చేరింది. మహాకూటమిలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. దీంతో తమ పార్టీ అభ్యర్థిగా సామ రంగారెడ్డిని ఆ పార్టీ ప్రకటించింది. అయితే తాను ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటే పక్క నియోజకవర్గ కేటాయించడమేంటని సామ రంగారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్బీనగర్‌ తెదేపా సిట్టింగ్‌ స్థానం కావడంతో తొలి నుంచి తనకే …

Read More »

పాలన చేతకాదన్నారు..తలెత్తుకునేలా పాలించాం మీట్ ది ప్రెస్‌లో మంత్రి కేటీఆర్‌

నవ తెలంగాణే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని.. విభజన సమయంలో లేవనెత్తిన అనుమానాలు తెరాస ప్రభుత్వ హయాంలో నివృత్తి అయ్యాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని పార్లమెంట్‌ వేదికగా కేంద్రం పేర్కొన్న విషయాన్ని ఆయన‌ గుర్తు చేశారు. నేత కార్మికుల ఆత్మస్థైర్యం పెంపొందేలా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. 1956 నుంచి 2014 వరకు రంగారెడ్డి …

Read More »